Shikhar Dhawan Latest Post :టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ని అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుస్తారు. ఈ పేరుకు తగ్గట్టే గుండు, పెద్ద మీసాలతో శిఖర్ లుక్ రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుంది. లుక్ ఎలా ఉన్నా శిఖర్ మాత్రం చాలా సరదాగా ఉంటాడు. క్రికెట్‌కి దూరమైన తర్వాత అతడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా తన తండ్రితో కలిసి చేసిన ఓ రీల్ ఫ్యాన్స్‌కి తెగనచ్చేసింది. శిఖర్ ధావన్, తండ్రి మహేంద్ర పాల్ ధావన్ కలిసి చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇద్దరి ఇంటరాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది
ధావన్ తన తండ్రితో, 'నాన్న నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను' అని చెబుతాడు. దీనికి మహేంద్ర పాల్ ధావన్ ఇచ్చిన కౌంటర్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. అతడు 'తొలిసారి పెళ్లి చేసినప్పుడే నీకు హెల్మెట్ పెట్టి చేశాం' అని అన్నారు.
తండ్రి, కుమారులు సరదాగా చేసిన రీల్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ రీల్‌కి శిఖర్ పెట్టిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. తన ఫాలోవర్లను 'నేను నిజంగా అంత చెడ్డగా కనిపిస్తున్నానా? చెప్పండి!' అని అడిగాడు. ఈ రీల్ కొన్ని గంటల్లోనే ఫుల్ వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 51 లక్షల మందికిపైగా రీల్‌ని లైక్ చేశారు. దాదాపు నాలుగు వేల వరకు కామెంట్లు వచ్చాయి. అభిమానులు నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది.