James Anderson Retirement:ఇంగ్లాండ్ స్టార్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 41ఏళ్ల అండర్సన్ జులై 10న లార్డ్స్ మైదానం వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టుతో తన క్రికెట్ కెరీర్ ముగియనున్నట్లు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
'ఈ వేసవిలో లార్డ్స్ వేదికగా ఆడనున్న తొలి టెస్ట్ నా కెరీర్లో ఆఖరి మ్యాచ్ కానుంది. ఈ 20ఏళ్లుగా నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. దేశానికి ఆడడం కంటే పెద్ద కల ఇంకోటి లేదు. నా కెరీర్లో నాకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, నా కోచ్‌లు, సహచర ప్లేయర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక క్రికెట్ నుంచి తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నాను' అని అండర్సన్ అన్నాడు.
ఇక 2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ గత 20 ఏళ్లుగా ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టిన తొలి ఇంగ్లాండ్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 187 టెస్టుల్లో ఏకంగా 700 వికెట్లు పడగొట్టాడు. అందులో 32సార్లు 5వికెట్లు, 23సార్లు 10వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 700 వికెట్లు నేలకూల్చిన తొలి పేసర్‌గా కూడా రికార్డు కొట్టాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా కొనసాగుతున్నాడు.