తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లో రేర్ ఫీట్​- సింగిల్ ఫ్రేమ్​లో 13మంది ప్లేయర్లు- వీడియో వైరల్ - England County Cricket

Somerset vs Surrey 2024: ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఛాంపియన్​షిప్​లో అరుదైన ఫీట్ నమోదైంది. ఒకే ఫ్రేమ్​లో 13 మంది ప్లేయర్లు కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Somerset vs Surrey 2024
Somerset vs Surrey 2024 (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 13, 2024, 1:14 PM IST

Somerset vs Surrey 2024:ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఛాంపియన్​షిప్​లో అరుదైన ఫీట్ నమోదైంది. ఓకే ఫ్రేమ్​లో 13 మంది ప్లేయర్లు కనిపించారు. అయితే ఒక్కో జట్టులో 11 మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. అలాంటింది 13 మంది ప్లేయర్లు ఒకే ఫ్రేమ్​లో కనిపించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. అసలేం జరిగిందంటే?

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సోమర్సెట్- సర్రే టీమ్​ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో 219 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు దిగిన సర్రే జట్టు 109/9 స్కోరు వద్ద నిలిచింది. ఇక మ్యాచ్‌ ఆఖరిరోజు మరో 3 నిమిషాల్లో ఆట ముగియాల్సి ఉంది. దీంతో వికెట్ కాపాడుకొని మ్యాచ్​ను డ్రా గా ముగించుకోవాలని సర్రే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో సోమర్సెట్ మంచి ప్లాన్ వేసింది. ఎలాగైన ఆఖరి వికెట్ తీసి మ్యాచ్​లో విజేతగా నిలవాలని బౌలర్, వికెట్ కీపర్ కాకుండా మిగతా ఫీల్డర్లందరినీ (9 మంది) బ్యాటర్‌కు పక్కనే ఫీల్డింగ్‌ సెట్‌ చేసింది. ఇక లీచ్‌ వేసిన ఆ బంతిని బ్యాటర్ డేనియల్ వార్రల్ అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు.

కానీ, బంతి నేరుగా బ్యాటర్ ప్యాడ్లను తాకింది. వెంటనే అంపైర్‌ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో సర్రే 109 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సోమర్సెట్ 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాటర్లతో కలిపి సోమర్సెట్‌ టీమ్​లోని 11 మంది ప్లేయర్లూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్​విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్​ ఫస్ట్​ ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. తర్వాత సర్రే కూడా అద్భుతంగా ఆడింది. 321 పరుగులు చేసి నాలుగు పరుగులు లీడ్​లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో సోమర్సెట్​ను 224 పరుగులకు ఆలౌట్‌ చేసిన సర్రే లక్ష్య ఛేదనలో మాత్రం తడబడింది.

సంక్షిప్త స్కోర్లు

  • సోమర్సెట్ : 317-10, 224-10
  • సర్రే : 321-10, 109-10

ధోనీ స్టైల్​లో వికెట్ కీపింగ్​ - అదరగొట్టిన సంజూ! - Sanju Samson Rajasthan Royals

ఆండర్సన్ సూపర్ డైవ్​ - 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే

ABOUT THE AUTHOR

...view details