Dust vs Green Pitch:భారత్- సౌతాఫ్రికా మధ్య ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. దానికి కారణం పిచ్ పరిస్థితి. అక్కడ ఆ పిచ్‌పై తేమ శాతం అధికంగా ఉండడం వల్ల రెండు రోజుల వ్యవధిలోనే 33 వికెట్లు నేలకూలాయి. అయితే ఈ పిచ్ పరిస్థితులపై మాట్లాడటానికి టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దగా ఆసక్తి చూపలేదు. పిచ్‌కు రేటింగ్ ఇచ్చే విషయంలోనూ తటస్థంగా ఉండాలని కోరాడు. అయితే ఏదైనా అతిథ్య జట్టు తమ ఆటకు అనుకూలంగా క్రికెట్ పిచ్‌ను తయారు చేసుకుంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా డస్ట్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే, గ్రీన్ పిచ్ పేస్‌కు సహకరిస్తుంది.
అయితే పిచ్‌ల విషయంలో ఇంగ్లీష్ మీడియా ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగానే వ్యవహరిస్తుంది. భారత్‌కు వచ్చిన తమ జట్టు ఓడిపోతే దానికి కారణం గ్రౌండ్ తయారీ విధానమే అని నిందించే అక్కడి మీడియా, గెలిచినప్పుడు మాత్రం దాని గురించి స్పందించదు. గతంలో 2021లో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తొలుత 1-0తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత మూడు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పొయింది. దీనికి భారత్ పిచ్లే కారణమని అక్కడి మీడియా నిందించింది.
సాధారణంగా భారత్‌లో డస్ట్ పిచ్‌లు అధికంగా ఉంటాయి. ఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం. వీటిపై బంతి పెద్దగా బౌన్స్ అవ్వదు. అందుకే భారత్ పిచ్‌లపై ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు కాస్త ఇబ్బంది పడతారు. ఇక వాళ్ల జట్టు ఓడితే పిచ్ తయారీలోనే లోపముందని నిందిస్తారు. అయితే భారత్ విదేశీ (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా) పర్యటనలకు వెళ్లినప్పుడు వారు గ్రీన్ పిచ్‌లు తయారు చేస్తారు. అవి పేస్‌కు సహకరిస్తాయి. వాటిపై తొలిరోజు నుంచే బంతి ఊహించని విధంగా బౌన్స్ అవుతుంది. అలాంటి బంతులు ఎదుర్కొవడం భారత ఆటగాళ్లకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు వార్తలు రాసే ఇంగ్లీష్ మీడియా సంస్థలు అక్కడి పిచ్‌లు బౌన్స్‌కు సహరించేలా ఉన్నప్పుడు స్పందించవు.