తెలంగాణ

telangana

దులీప్‌ ట్రోఫీ స్క్వాడ్స్ ఔట్ - రోహిత్‌, కోహ్లీ నో ఇంట్రెస్ట్!​ - Duleep Trophy 2024

By ETV Bharat Sports Team

Published : Aug 14, 2024, 5:17 PM IST

Duleep Trophy Team India Squad : ఈ ఏడాది దులీప్ ట్రోఫీ కోసం ఆడనున్న టీమ్ఇండియా ప్లేయర్ల జాబితాను బీసీసీఐ తాజాగా అనౌన్స్​ చేసింది. ఇంతకీ ఇందులో ఎవరెవరు ఉన్నారంటే?

Duleep Trophy Team India Squad
Duleep Trophy Team India Squad (Associated Press)

Duleep Trophy Team India Squad :సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకానున్న దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ తాజాగా టీమ్ఇండియా స్క్వాడ్​ను ప్రకటించింది. అజిత్ అగర్కర్ నేతృత్వంలో ఇటీవలే జరిగిన మీటింగ్​లో ఫస్ట్ రౌండ్‌ మ్యాచ్​లకు గానూ ఎన్నికైన నాలుగు జట్ల ప్లేయర్ల లిస్ట్​ను రిలీజ్ చేసింది. అయితే ఇందులో టీమ్ఇండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక నాలుగు టీముల్లో ఉన్న ప్లేయర్లు ఎవరంటే?

టీమ్ ఎ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుశ్ కోటియన్, కుల్​దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.

టీమ్ బీ : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముకేశ్​ కుమార్, కేఎల్ రాహుల్, దీపక్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).

టీమ్ సి : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైశాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, ఆర్యన్ జూయల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.

టీమ్​ డి : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాక్రే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్​ సెన్​ గుప్తా, కేఎస్ భరత్​ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.

ABOUT THE AUTHOR

...view details