తెలంగాణ

telangana

ETV Bharat / sports

సైలెంట్​గా పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా- అమ్మాయి ఎవరంటే? - NEERAJ CHOPRA MARRIAGE

ఓ ఇంటివాడైన నీరజ్ చోప్రా- అమ్మాయి ఎవరంటే?

Neeraj Chopra Marriage
Neeraj Chopra Marriage (Neeraj Chopra 'X' Screen Grab)

By ETV Bharat Sports Team

Published : Jan 19, 2025, 10:16 PM IST

Updated : Jan 19, 2025, 10:25 PM IST

Neeraj Chopra Marriage :డబుల్ ఒలింపిక్ మెడల్ విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్‌ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. అతడు హిమాని అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఆదివారం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడి పెళ్లి గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

'జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను. మీ అందరి ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక నీరజ్​కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు, అథ్లెట్లు నీరజ్​కు కంగ్రాజ్యులేషన్స్​ చెప్తున్నారు. అయితే నీరజ్ సతీమణి హిమాని అమెరికాలో ఉన్నత చదువు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

ఎవరీ హిమాని
నీరజ్ సతీమణి హిమాని మోర్ హరియాణాకు చెందిన కుటుంబం. ఆమెకు చిన్నప్పటి నుంచి టెన్నిస్​పై ఆసక్తి ఎక్కువ. ఆమె దిల్లీ యూనివర్సీటీలో ఉన్నప్పుడు మంచి టెన్నిస్ ప్లేయర్. ఆ తర్వాత హిమాని అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ పియర్స్ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేసింది. అలాగే ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి హిమాని మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది.

కాగా, భారత్ తరఫున నీరజ్ రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని నెగ్గాడు. 2020 టోక్యోలో స్వర్ణం నెగ్గిన నీరజ్, గతేడాది పారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో రజత పతకం దక్కించుకున్నాడు.

Last Updated : Jan 19, 2025, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details