తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నన్ను, నా ఫ్యామిలీని చాలాసార్లు తిట్టారు'- RCB ఫ్యాన్స్​పై డీకే షాకింగ్ కామెంట్స్ - Dinesh Karthik On Rcb Fans - DINESH KARTHIK ON RCB FANS

Dinesh Karthik On RCB Fans: స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆర్సీబీ ఫ్యాన్స్​పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ చాలాసార్లు తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా తిట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Dinesh Karthik On Rcb Fans
Dinesh Karthik On Rcb Fans

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 3:32 PM IST

Updated : Apr 8, 2024, 3:45 PM IST

Dinesh Karthik On RCB Fans:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఈ ఫ్రాంచైజీ అభిమానులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిక్, తనతోపాటు తన ఫ్యామిలీని కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ చాలాసార్లు తిట్టారని అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

2024 ఐపీఎల్​లో బిజీగా ఉన్న దినేశ్ కార్తిక్​, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్​ ఛానెల్​లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ చిట్​చాట్​లో డీకే, అశ్విన్​తో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. 'ఆర్సీబీకి మ్యాచ్​ ఫినిషర్​గా క్రీజులోకి వెళ్తున్నప్పుడు చిన్నస్వామి స్టేడియంలోని ఫ్యాన్స్ 'డీకే' 'డీకే' అని అరుస్తుంటే నువ్వు ఎలా ఫీలౌతావు?', 'ఆర్సీబీ ఫ్యాన్​బేస్ గురించి చెప్పు' అని కార్తిక్​ను అశ్విన్ అడుగుతాడు. దానికి కార్తిక్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

'ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక ఫ్యామిలీ లాంటి వాళ్లు. వాళ్లు ఆర్సీబీ పట్ల లాయల్​(విదేయులు)గా ఉంటారు. కానీ, వాళ్ల గురించి మంచి, చెడు రెండు మార్గాల్లో చెబుతా. మంచి ఏంటంటే, నేను క్రీజులోకి వెళ్తుంటే స్టేడియం అంతా నా పేరు మార్మోగిస్తారు. ఈ ప్రపంచంలో నేనే గ్రేట్ ప్లేయర్ అన్నట్లుగా ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. మా జట్టు ప్లేయర్లు బాగా ఆడరు అని ఎవరైనా అంటే వాళ్లతో ఫైట్ చేస్తారు. మా రికార్డుల గురించి చెబుతూ వాళ్లపై విరుచుకుపడతారు. కానీ, నేను మ్యాచ్​లో బాగా ఆడకపోతే అదే ఫ్యాన్స్ పర్సనల్​గా నాకు డైరెక్ట్ మెసేజ్​లు చేసి తిడుతుంటారు. నన్ను ఒక్కడినే కాదు, నా ఫ్యామిలీ మొత్తాన్ని తిడతారు. కానీ బయటకు మాత్రం అది తెలియనివ్వరు. నేను ఐపీఎల్​లో చాలా టీమ్స్​కు ఆడాను. అన్ని ఫ్రాంచైజీలకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్​ మాత్రం చాలా స్పెషల్' అని నవ్వుతూ బదులిచ్చాడు.

ఇక ప్రస్తుత సీజన్​లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా 5మ్యాచ్​లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకదాంట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అటు దినేశ్ కార్తిక్ కూడా ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 4 ఇన్నింగ్స్​ల్లో 90 పరుగులు మాత్రమే చేశాడు.

ఒక్కసారి హెయిర్​కట్​కు విరాట్ అంత ఖర్చు చేస్తాడా? - Virat Kohli Hairstyle Cost

అత్యధిక పరుగులే కాదు - ఆ రికార్డులోనూ విరాట్​కు తిరుగేలేదు! - Virat Kohli RCB

Last Updated : Apr 8, 2024, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details