తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నా కొడుకు ఎక్కడున్నా నాన్న కోసం వస్తాడు': ధావన్ ఎమోషనల్ - Shikhar Dhawan Ipl

Dhawan Team India: తన కుమారుడిని మిస్ అవుతున్నట్లు క్రికెటర్ శిఖర్ ధావన్ తెలిపాడు. రీసెంట్​గా కుమారుడి బర్త్​డే సందర్భంగా పోస్ట్​ చేసిన ధావన్, తాజాగా ఓ పాడ్​కాస్ట్​లో మళ్లీ అతడిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

DHADhawan Team India
DHADhawan Team India

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 1:01 PM IST

Updated : Jan 30, 2024, 2:16 PM IST

Dhawan Team India:టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ తన కుమారుడి గురించి ప్రస్తావిస్తూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. గతనెల తన కుమారుడి బర్త్​ డే సందర్భంగా ఎమోషనల్​ పోస్ట్ చేసిన ధావన్, రీసెంట్​గా 'హ్యూమన్స్​ ఆఫ్ బాంబే' పాడ్​కాస్ట్​లో మరోసారి మాట్లాడాడు. తన కుమారుడిని రోజూ మెసేజ్​లు పంపుతున్నట్లు ఈ ప్రోగ్రామ్​లో చెప్పాడు.

'నేను రోజూ జొరావర్ (కుమారుడి పేరు)కు మెసేజ్​లు పంపుతున్నా. అవి అతడికి చేరుతున్నాయా? మెసేజ్​లు జొరావర్ చదువుతున్నాడా? లేదా? అది నాకు తెలీదు. ఒక తండ్రిగా నేను చేయాల్సింది చేస్తున్నా. వాడితో మాట్లాడి 5 నెలలు అయ్యింది. నేను వాడిని చాలా మిస్ అవుతున్నా. నా పోస్టులు వాడు చూస్తాడని ఆశిస్తున్నా. బాధగా కూడా ఉంటుంది. కానీ అలవాటైపోయింది. నేను జొరావర్​ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించా, రెండుసార్లు మాత్రమే కుదిరింది. అది కూడా కేవలం 2-3 గంటలు గడిపాను. వాడు ఎక్కడ ఉన్నా, ఏదో ఒక రోజు కచ్చితంగా నా దగ్గరకు వస్తాడు. నా కుమారుడు నాతోనే ఉండాలనుకుంటున్నా. వాడు ఎక్కడ ఉన్నా, ఏదో ఒక రోజు కచ్చితంగా నా దగ్గరకు వస్తాడు. నా కుమారుడిని హగ్ చేసుకోవాలని ఉంది' అని ధావన్ అన్నాడు.

Shikhar Dhawan Family: ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని శిఖర్​ ధావన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల 2020 నుంచి ఈ ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ధావన్‌ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఇక గతేడాది వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. అంతకుముందు నుంచే కుమారుడు జొరావర్ ఆయేషాతోనే ఉంటున్నాడు.

అయితే, తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్‌ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు ఇదివరకే కోర్టు నిరాకరించింది. అయినప్పటికీ ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతించింది. అంతే కాకుండా స్కూల్‌ వెకేషన్‌ సమయంలో ఆయేషా జోరావర్​ను ఇండియాకు తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో టైమ్ స్పెండ్​ చేసేలా చూడాలంటూ కోర్టు ఆదేశించింది. కానీ, గత ఐదు నెలలుగా కుమారుడి నుంచి తనను పూర్తిగా బ్లాక్‌ చేశారంటూ ధావన్‌ తాజాగా ఆరోపించాడు.

Shikhar Dhawan Divorce : శిఖర్‌ ధావన్‌కు విడాకులు మంజూరు.. విచారణలో తేలిన నిజాలు

తనయుడి కోసం ధావన్​ ఎమోషనల్ - 'దేవుడి దయ వల్ల మనం మళ్లీ కలుస్తాం'

Last Updated : Jan 30, 2024, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details