Mumbai Indians vs Delhi Capitals WPL 2025: 2025 డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. ముంబయి నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను దిల్లీ ఓవర్లన్నీ ఆడి ఛేదించింది. షఫాలీ వర్మ (43 పరుగుల), నిక్కీ ప్రసాద్ (35* పరుగులు), సారా (21 పరుగులు) రాణించారు. ముంబయి బౌలర్లలో అమెలియా కెర్ , హేలీ మ్యాథ్యూ చెరో 2, నాట్ సీవర్, షబ్నమ్ తలో 1వికెట్ దక్కించుకున్నారు.
దిల్లీ థ్రిల్లింగ్ విన్- పోరాడి ఓడిన ముంబయి - 2025 WPL
ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం- ముంబయికి తప్పని ఓటమి

Published : Feb 15, 2025, 11:06 PM IST
షఫాలీ దూకుడు
165 పరుగుల లక్ష్య ఛేదనను దిల్లీ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (43 పరుగులు, 18 బంతులు) బౌండరీలతో విరుచుకుపడింది. దూకుడుగా ఆడుతూ పవర్ ప్లేలోనే జట్టు స్కోర్ 60కు చేర్చింది. ఇక 5.5 వద్ద మ్యాథ్యూ హేలీ బంతికి క్యాచౌట్‌గా వెనుదిరిగింది. దీంతో దిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ మెగ్ లానింగ్ (15)ను షబ్నమ్ క్లీన్ బౌల్డ్ చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. నాట్ సీవర్ (80* పరుగులు; 59 బంతుల్లో: 13x4) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42 పరుగులు, 22 బంతుల్లో) రాణించింది. జట్టు స్కోరులో దాదాపు 80శాతం పరుగులు ఈ ఇద్దరివే కావడం గమనార్హం. మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. దిల్లీ బౌలర్లలో సుదర్లాండ్ 3, శిఖా పాండే 2, కాప్సె, మిన్ను మని చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.