David Warner Captaincy :ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సిడ్ని థండర్ (Sydney Thunder) జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ తాజాగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇటీవల వార్నర్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎత్తివేయడం వల్ల, ఆరేళ్ల తర్వాత మళ్లీ సారథిగా జట్టును నడిపించడనున్నాడు. దీంతో 2024 బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్ని థండర్ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించడనున్నాడు.
అయితే తనను కెప్టెన్‌గా ప్రకటించడంపై వార్నర్ స్పందిచాడు. తన పేరు పక్కన కెప్టెన్ అనే ట్యాగ్ ఉండడం అద్భుతంగా అనిపిస్తోందని వార్నర్ అన్నాడు. యంగ్ ప్లేయర్లతో తన అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు సిడ్ని థండర్స్ అఫీషియల్ వెబ్సైట్లో చెప్పాడు.
'ఈ సీజన్లో థండర్ జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉంది. టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఈ జట్టుతో నా అనుబంధం కొనసాగుతోంది. ఇక నా పేరు పక్కన మళ్లీ కెప్టెన్ అనే ట్యాగ్ రావడం అద్భుతంగా అనిపిస్తోంది. నా అనుభవంతో జట్టును ముందుకు తీసుకెళ్తా. జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టిస్తాను. కెప్టెన్సీ అనేది మైదానం బయటకూడా కీలకమే. యువ ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా ఉండడం చాలా ముఖ్యం. వాళ్లతో నా అనభవాన్ని కూడా షేర్ చేసుకుంటా' అని వార్నర్ పేర్కొన్నాడు.
IPLలోనూ ఛాన్స్!
కాగా, 2024 బిగ్‌బాష్ లీగ్ డిసెంబర్ 15న ప్రారంభం కానుంది. ఇక ఈ లీగ్‌లో కెప్టెన్‌గా రాణిస్తే, 2025 ఐపీఎల్‌లోనూ వార్నర్‌కు జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతంత కోల్‌కతా, పంజాబ్, లఖ్‌నవూ, ఆర్సీబీ, దిల్లీ జట్లకు కెప్టెన్ లేడు. ఈ క్రమంలో మెగా వేలంలో ఆయా జట్లు వార్నర్‌పై ఓ లుక్కేసే ఛాన్స్ ఉంది. వేలంలో దక్కించుకొని నాయకత్వ బాధ్యతలు కూడా అప్పజెప్పే అవకాశం ఉంది.