David Warner 3rd T20 Series :ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సొంతగడ్డపై ఆడిన ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన ఆఖరి టీ20లో ఈ రికార్డును సాధించాడు. 49 బంతుల్లోనే 81 పరుగులు చేసిన వార్నర్, పొట్టి ఫార్మాట్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా నిలిచాడు. మూడో టీ20కి ముందు 48 పరుగుల దూరంలో ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో 81 పరుగులు చేయడం వల్ల అతడు 12 వేల పరుగుల మైల్‌స్టోన్‌ను దాటాడు.
మరోవైపు ఈ లిస్ట్‌లో ఓవరాల్‌గా ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్న వార్నర్ ఉన్న ఆస్ట్రేలియా నుంచి మాత్రం ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఇప్పటికే ఈ జాబితాలో షోయభ్ మాలిక్, క్రిస్ గేల్, కీరిన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్‌లు ఉన్నారు. అయితే 343 మ్యాచ్‌లలో క్రిస్ గేల్ ఈ ఘనతను అందుకోగా, డేవిడ్ వార్నర్ 368 మ్యాచల్లో దీన్ని సాధించాడు. ఇక అలెక్స్ హేల్స్ (435 మ్యాచ్‌లు), షోయభ్ మాలిక్ (486)లు ఆ తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు.