Cummins Valentines Post Reply:ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సోషల్ మీడియాలో క్రేజీ మూమెంట్ ఎదురైంది. వాలెంటైడ్ డే సందర్భంగా తన భార్య బెకీ బోస్టన్తో ఉన్న ఫొటోను కమిన్స్ షేర్ చేశాడు. 'సూపర్ మామ్ (తల్లి), భార్య, నా లవ్‌కు హ్యాపీ వాలెంటైన్' అని ఫొటోకు క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్‌కు వేలాది మంది కమిన్స్ ఫ్యాన్స్ 'లవ్లీ కపుల్' అంటూ కామెంట్ చేశారు. అయితే ఓ నెటిజన్ అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా కామెంట్ చేసి పోస్ట్‌ను వైరల్‌గా మార్చాడు.
అందరిలా సింపుల్‌గా కామెంట్ చేస్తే కామన్ అనుకున్నాడేమో ఆ వ్యక్తి. అందుకే కాస్త భిన్నంగా ఆలోచించి, 'ఐయామ్ ఇండియన్, ఐ లవ్ యూ యువర్ వైఫ్ (నీ భార్యను ప్రేమిస్తున్నా)' అని కామెంట్ సెక్షన్లో రాశాడు. దీనిపై పాజిటివ్‌గా స్పందించిన కమిన్స్ 'ఈ విషయాన్ని ఆమెకు చెప్తాను లే' అని నెటిజన్ కామెంట్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో పోస్ట్ వైరలైంది. ఈ విషయాన్ని కమిన్స్ పాజిటివ్‌గా తీసుకొని ఫన్నీగా రెస్పాండ్ అవ్వడం ఫ్యాన్స్‌కు కూడా నచ్చింది. కాగా, ప్యాట్ కమిన్స్- బెకీ బోస్టన్ చాలా ఏళ్లు డేటింగ్ చేసి, 2022లో వివాహం చేసుకున్నారు. ఈ కపుల్ పెళ్లికి ముందే తల్లిదండ్రులయ్యారు. 2021లో వీరికి బాబు జన్మించాడు.