తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెపాక్​లో చెన్నై గెలుపు - పోరాడి ఓడిన రాజస్థాన్ - IPL 2024 - IPL 2024

CSK VS RR IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరులో చెన్నై విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

CSK VS RR IPL 2024
CSK VS RR IPL 2024 (Source : Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 7:05 PM IST

Updated : May 12, 2024, 7:15 PM IST

CSK VS RR IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరులో చెన్నై విజయం సాధించింది. 142 పరుగుల టార్గెట్​ను ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. రుతురాజ్ గైక్వాడ్(42*) పరుగులతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. రచిన్ రవీంద్ర (27), డ్యారీ మిచెల్(22), శివమ్ దుబె (18) కూడా మంచి స్కోర్ సాధించారు. మొయిన్‌ అలీ (10), రవీంద్ర జడేజా (5) నిరాశపరిచారు. ఇక ఆఖరిలో వచ్చిన సమీర్ రిజ్వీ (15*) ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్‌ 2 వికెట్లు పడగొట్టగా, నాండ్రీ బర్గర్‌, యుజ్వేంద్ర చాహల్‌ చెరో వికెట్‌ తీశారు.

ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించిన చెన్నై జట్టు ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అలా ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్ జట్టు, చెన్నై బౌలర్ల ధాటికి తేలిపోయింది. రియాన్‌ పరాగ్ (47*) టాప్‌ స్కోరర్​గా నిలిచి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. యశస్వి జైస్వాల్‌ (24), జోస్ బట్లర్ (21), ధ్రువ్ జురెల్ (28), సంజు శాంసన్ (15) ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో సిమర్‌జీత్‌ సింగ్ (3/26), తుషార్‌ దేశ్‌ పాండే (2/30) రాజస్థాన్‌ను కట్టడి చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు :రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ
ఇంపాక్ట్ సబ్​స్టిట్యూట్స్ :అజింక్యా రహానే, సమీర్ రిజ్వీ, ప్రశాంత్ సోలంకి, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు : సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్
ఇంపాక్ట్ సబ్​స్టిట్యూట్స్ : రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.

'ఈ సీజన్​లో మేం సరైన క్రికెట్ ఆడలేదు'- ముంబయి వైఫల్యాలపై హార్దిక్ రియాక్షన్! - IPL 2024

నరైన్ అరుదైన ఫీట్- మూడో ప్లేయర్​గా ఘనత- మ్యాచ్​లో నమోదైన రికార్డులు - IPL 2024

Last Updated : May 12, 2024, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details