Bumrah Music Concert :టీమ్ఇండియా స్టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరుతో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం మార్మోగిపోయింది. రీసెంట్గా ఈ స్టేడియంలో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్కు బుమ్రా హాజరై సందడి చేశాడు. తన రాకతో బుమ్రా ఈ ఈవెంట్లో జోష్ నింపాడు. అతడితో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఒక్కసారిగా స్టేడియం అంతా 'బుమ్రా', 'బుమ్రా' పేరుతో దద్దరిల్లిపోయింది. దీంతో ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బుమ్రాపై, హాలీవుడ్ సింగర్ క్రిస్ మార్టిన్ ఓ సాంగ్ పాడాడు.
మ్యూజిక్ కన్సర్ట్‌లో 'బుమ్రా' సాంగ్- లక్ష మందితో హోరెత్తిన ఈవెంట్ - BUMRAH MUSIC CONCERT
మ్యూజిక్ కన్సర్ట్‌లో బుమ్రాపై పాట- దద్దరిల్లిన ఈవెంట్
Published : Jan 27, 2025, 10:43 AM IST
|Updated : Jan 27, 2025, 11:09 AM IST
'జస్ప్రీత్, మై బ్యూటీఫుల్ బ్రదర్. ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్. వి డిడ్ నాట్ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లాండ్ విత్ వికెట్ ఆఫ్టర్ వికెట్స్' (ఇంగ్లాండ్‌పై నువ్వు వికెట్ల మీద వికెట్లు పడగొడుతుంటే మేం చూడలేకపోతాం) అంటూ లిరిక్స్‌తో పాట పాడాడు. ఈ సాంగ్‌ను అక్కడున్న ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. వెంటనే గతంలో ఇంగ్లాండ్‌పై బుమ్రా చేసిన అత్యుత్తమ ప్రదర్శనను స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌లో ప్లే చేశారు. దీంతో మైదానం ఒక్కసారిగా కేరితంలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌కు దాదాపు లక్షా 20 వేలకు పైగా ఆడియెన్స్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 21వ సెంచరీలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాజిక్ కన్సర్ట్‌గా ఇది రికార్డ్ కొట్టింది