తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్​కు ఆ రెండే కీలకం- ఒక్కసారి అలా చేస్తే ఆసీస్​కు చుక్కలే'

విరాట్​కు మద్దతుగా నిలిచిన పుజారా- ఆసీస్​తో సిరీస్​లో రాణిస్తాడని విశ్వాసం!

Pujara On Virat Kohli
Pujara On Virat Kohli (Source : Getty Images (Left), AP (Right))

By ETV Bharat Sports Team

Published : 8 hours ago

Pujara On Virat Kohli :టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీపై సీనియర్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా ప్రశంసలు కురిపించాడు. కోహ్లీకి గతంలో ఆస్ట్రేలియాతో ఆడిన అనుభవం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్​లో విరాట్​కు తొలి రెండు టెస్టులు చాలా కీలకమని తెలిపాడు. ఈ రెండు టెస్టుల్లో క్రీజులో కుదురుకుని సెంచరీ నమోదు చేస్తే, సిరీస్ మొత్తం అదే ఫామ్ కొనసాగిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

కోహ్లీకి అదే ముఖ్యం
'గతంలో ఆస్ట్రేలియాపై కోహ్లీ పరుగుల వరద పారించాడు. ఆ అనుభవం, సక్సెస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఉపయోగపడుతుంది. అలాగే అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆస్ట్రేలియాలోనే కాదు ఏ జట్టుతో మ్యాచ్ అయినా, ఏ ఫార్మాట్​లో నైనా కోహ్లీపై భారీ అంచనాలు ఉంటాయి. అలాగే కోహ్లీ అద్భుతమైన ఫీల్డర్, అథ్లెట్ కూడా. కోహ్లీకి వరుస మ్యాచ్​లు ఆడడం వల్ల తగినంత విశ్రాంతి లభించలేదు. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్న కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడు. ప్రత్యర్థులు అతడిని కవ్వించినప్పుడు కోహ్లీ తన బ్యాటుతో ప్రతాపం చూపిస్తాడు' అని ఛెతేశ్వర్ పుజారా పేర్కొన్నాడు.

'అతడు సిద్ధమే'
టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తగినంత రెస్ట్ తీసుకుని ఆసీస్ తో సిరీస్​కు మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యాడని పుజారా అన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రాణించేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లీని రెచ్చగొడితే అతడు గట్టిగా స్పందిస్తాడని పేర్కొన్నాడు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తూ విజయం సాధిస్తున్నాడని వెల్లడించారు.

ఆవే కీలకం!
'ఈ సిరీస్​లో కోహ్లీకి మొదటి రెండు మ్యాచ్​లు అత్యంత కీలకం. అతడు రిథమ్​లోకి రావాలంటే ఎక్కువసేపు క్రీజులో ఉండాలి. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో విరాట్​కు బాగా తెలుసు. విరాట్ ఎప్పుడూ తన నుంచి బెస్ట్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తుంటాడు. 50 లేదా 60 స్కోర్లను కోహ్లీ సెంచరీలుగా మార్చాలి. అలా అయితే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొత్తం అదే ఫామ్ కొనసాగిస్తాడు' అని ఛెతేశ్వర్ పుజారా వ్యాఖ్యానించాడు.

'నాపై విరాట్ ఎఫెక్ట్- అలా చేశాకే ఇంప్రూవ్ అయ్యా'

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ - ఆసీస్​ గడ్డపై కోహ్లీ, రోహిత్​ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ABOUT THE AUTHOR

...view details