Rohit Sharma Son Name :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య రితికా సజ్దే నవంబర్ 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో 'రోహిక'(Rohika) జంట తమ చిన్నారి పేరు రివీల్ చేశారు. రోహిత్ భార్య రితిక ఇన్ స్టా వేదికగా కుమారుడి పేరు అనౌన్స్ చేశారు. ఆ చిన్నారికి 'అహాన్' అనే పేరు ఫిక్స్ చేసినట్లు రితిక ఇన్ స్టా పోస్టు చూస్తే తెలుస్తోంది.
డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్మస్ శాంటా గెటప్‌లో ఉన్న ఓ ఫ్యామిలీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు రితిక. అందులోనే అహాన్ పేరును రివీల్ చేశారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టర్లో ఉన్న బొమ్మలకు రితిక, రోహిత్ శర్మ, సమ్మీ, అహాన్ అనే పేర్లు కూడా పెట్టారు. దీంతో అభిమానులు ఆ పేరుకు అర్థం ఏంటని ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు.
రోహిత్ శర్మ, తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో 2015 డిసెంబర్ 13న ఈ జంట వివాహం గ్రాండ్‌గా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 2018 డిసెంబరు 30న ఓ కూతురు జన్మించింది. పాపకు సమైరాగా నామకరణం చేశారు. ఇక ఈ ఏడాది నవంబరు 15న రోహిత్- రితిక జంట రెండో బిడ్డను ఆహ్వానించారు. వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ చిన్నారికి తాజాగా అహాన్ అని నామకరణం చేశారు.
ఆసీస్ పర్యటనలో