Bumrah Wife Sanjana Body Shamed: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ తన శరీరాకృతిపై కామెంట్ చేసిన అభిమానికి గట్టి గుణపాఠం చెప్పారు. ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ చేసిన ప్రచార చిత్రంలో బుమ్రా దంపతులు నటించారు. వాలెంటైన్స్ సందర్భంగా సంజనా సోమవారం తన ఇన్‌స్టా పేజీలో ఓ ప్రమోషన్ వీడియోను పోస్ట్ చేశారు. అయితే అందులో సంజన శరీరాకృతిపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీంతో వాళ్లకు సంజనా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
'మీరు చాలా లావుగా ఉన్నారు' అంటూ ఓ నెటిజన్ బాడీషేమింగ్ చేశాడు. ఆ కామెంట్‌కు సంజనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తిరిగి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. " పాఠశాల్లో సైన్స్ పుస్తకాల్లో మీరు చదువుకున్న విషయాలు గుర్తులేవా? మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి మీకెంత ధైర్యం? ఇక్కడి నుంచి వెళ్లిపో " అంటూ సంజనా గణేశన్ చురకలు అంటించారు. ఈ క్రమంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. 'సరిగ్గా చెప్పారు మేడం' అంటూ ప్రశంసిస్తున్నారు.
ఇకపోతే ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో సంజనా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి చిన్న విరామం దొరకడం వల్ల బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. త్వరలోనే జట్టుతో చేరనున్నారు.