తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ ఇండియా ఆలౌట్​ - అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయిన టీమ్ ఇండియా.

AUS vs IND 1st Test Nitish kumar Reddy
AUS vs IND 1st Test Nitish kumar Reddy (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 22, 2024, 1:11 PM IST

Border Gavaskar Trophy AUS vs IND 1st Test Live : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 150 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి వికెట్‌గా వెనుదిరిగిన తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి (41) టాప్ స్కోరర్​గా నిలిచాడు. నితీశ్ కాకుండా పంత్ (37), కేఎల్ రాహుల్ (26), ధ్రువ్ జురెల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్​ అయ్యారు. కోహ్లీ (5), సుందర్ (4), హర్షిత్ రాణా (7), బుమ్రా (8) విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ (4/29), కమిన్స్ (2/14), మార్ష్ (2/12), స్టార్క్ (2/14) వికెట్లు పడగొట్టారు.

పేస్‌ దెబ్బ

దూకుడు ప్రదర్శన చేసే యశస్వి జైశ్వాల్ కేవలం 8 బంతులు ఆడి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉండటం వల్ల పరుగులు చేయడం కష్టంగా మారింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ క్రీజ్‌లో కాసేపు రాణించాడు. అయితే, వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత జట్టులో చేరిన దేవదత్ పడిక్కల్ 23 బంతులు ఆడినప్పటికీ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ హేజిల్‌వుడ్ బౌన్సర్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమై స్లిప్‌లో దొరికిపోయాడు.

అలా స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను ఆదుకొనేందుకు పంత్ ప్రయత్నించాడు. నిలకడగా ఆడుతూనే బౌండరీలు బాదేందుకు ప్రయత్నించాడు. ఇక ధ్రువ్‌ జురెల్, వాషింగ్టన్ సుందర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. యంగ్ క్రికెటర్ నితీశ్ రెడ్డితో కలిసి పంత్ ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. దీంతో టీమ్‌ ఇండియా స్కోరు 150 వరకు చేసింది. అయితే కీలక సమయంలో పంత్‌ను కమిన్స్‌ ఔట్ చేశాడు. ఇక బుమ్రా సిక్స్‌ను బాదిన కాసేపటికే ఓట్ అయిపోయాడు. ఈ క్రమంలోనే నితీశ్‌ మరింత దూకుడు పెంచి ఆడాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది.

టాప్ స్కోరర్​గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ జర్నీ - 7 నెలల్లోనే IPL టు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ!

IND VS AUS - 147 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇలా జరగడం 6వ సారి

ABOUT THE AUTHOR

...view details