తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ క్రికెటర్లు బోర్డర్ గావస్కర్​తోనే టెస్ట్ కెరీర్ ముగించారు - ఎందుకంటే? - BORDER GAVASKAR TROPHY 2024

బోర్డర్ గావస్కర్​తోనే టెస్ట్ కెరీర్ ముగించిన టాప్ 5 క్రికెటర్లు ఎవరంటే?

Border Gavaskar Trophy 2024
Border Gavaskar Trophy 2024 (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Dec 17, 2024, 9:15 AM IST

Border Gavaskar Trophy 2024 : 2024 బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి టెస్టును భారత్‌ గెలుచుకోగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం అందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో దాదాపు రెండు రోజులు వర్షార్పణం అయ్యాయి. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా, భారత్‌ 51-4తో కష్టాల్లో ఉంది. ఈ కీలక సిరీస్‌లో కొందరు సీనియర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.

ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్, కోహ్లి నిరాశపరుస్తున్నారు. సీనియర్‌ స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా పరిస్థితి కూడా అంతే. ఈ సీనియర్‌లకు బహుశా ఇదే చివరి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కావచ్చని క్రికెట్ వర్గాల మాట. అయితే వీళ్లే కాదు గతంలో బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో చివరి టెస్టు ఆడిన లెజెండ్స్‌ చాలా మందే ఉన్నారు. ఇంతకీ వారెవరో చూద్దమా.

అనిల్ కుంబ్లే (2008)
దిగ్గజ స్టార్ ప్లేయర్ అనిల్ కుంబ్లే, 619 టెస్ట్ వికెట్లతో టీమ్‌ఇండియా తరఫున ఆల్-టైమ్ లీడింగ్ వికెట్ టేకర్. 2008లో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ భారత్‌లో జరిగింది. దిల్లీలో జరిగిన మూడో టెస్టులో కుంబ్లే రిటైర్ అయ్యాడు. ఎంఎస్‌ ధోని ఆఖరి టెస్ట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. భారత్ 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది.

సౌరవ్ గంగూలీ (2008)
భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ కూడా 2008 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోనే రిటైర్‌ అయ్యాడు. నాగ్‌పూర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ తర్వాత తన నిర్ణయం ప్రకటించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు చేశాడు, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. గంగూలీ మొత్తం 113 టెస్టుల్లో 7,212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు ఉన్నాయి.

రాహుల్ ద్రవిడ్ (2011-12)
2011-12 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ 4-0తో ఘోరంగా ఓడిపోవడం వల్ల రాహుల్ ద్రవిడ్ రిటైర్ అయ్యాడు. ద్రవిడ్ చివరి టెస్ట్ అడిలైడ్‌లో జరిగింది. ఇందులో ద్రవిడ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ద్రవిడ్‌ కెరీర్‌లో 164 టెస్టుల్లో 13,288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు ఉన్నాయి.

వీవీఎస్‌ లక్ష్మణ్ (2012)
లక్ష్మణ్‌ కూడా 2012 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోనే రిటైర్‌ అయ్యాడు. అడిలైడ్ టెస్టులో వరుసగా 18, 35 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 134 టెస్టుల్లో 178,781 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.

వీరేంద్ర సెహ్వాగ్ (2013)
వీరేంద్ర సెహ్వాగ్ 2013 సిరీస్ సమయంలో హైదరాబాద్‌లో తన చివరి టెస్టు ఆడాడు. చివరి ఇన్నింగ్స్‌లో కేవలం ఆరు పరుగులే చేశాడు. సెహ్వాగ్ మొత్తం 104 టెస్టుల్లో 8,586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి.

ఎం ఎస్ ధోని (2014)
2014 బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీలో మెల్‌బోర్న్ టెస్టు తర్వాత ధోని టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని మొత్తం 90 టెస్టులు ఆడి, 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి.

బాక్సింగ్ డే టెస్టుకు ఫుల్ క్రేజ్- అప్పుడే లక్ష టికెట్లు సోల్డ్!

'టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ ఎవరు- అసలు వాళ్లను గైడ్ చేస్తున్నదెవరు?'

ABOUT THE AUTHOR

...view details