Bopanna Tennis Australian Open 2024:43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్డు కొట్టాడు భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో నెగ్గి, అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. అయితే కొంతకాలం కిందట అనేక మ్యాచ్‌ల్లో పరాజయాలు. కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు. ఒక దశలో ఆటకు వీడ్కోలు పలుకుదామనున్నాడట. కానీ పట్టుదలకుండా నిరంతరం కృషి చేసి కలను సాకారం చేసుకున్నాడు బోపన్న. శనివారం ఫైనల్ మ్యాచ్ అనంతరం బోపన్న మాట్లాడాడు.
'కొంత కాలం కిందట దాదాపు 5 నెలలపాటు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. ఇక నా ప్రయాణం ముగిసిందనుకున్నా. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తానని వీడియో కూడా రిలీజ్ చేశా. కానీ, నా పట్టుదల నన్ను గేమ్ ఆడేలా చేశాయి. ఆ తర్వాత నా ఆటలో అనేక మార్పులు వచ్చాయి. నాకు ఓ మంచి పార్ట్నర్ దొరికాడు. ఆసీస్ స్టార్ ప్లేయర్ మ్యాటీ ఎబ్డెన్ నాతో పార్ట్నర్గా లేకపోయుంటే ఈ గెలుపు సాధ్యం అయ్యేది కాదు' అని బోపన్న అన్నాడు.
18 ఏళ్ల నిరీక్షణ:2006 నుంచి బోపన్న గతంలో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ ఫైనల్స్‌కు దూసుకెళ్లినా టైటిల్ నెగ్గండంలో విఫలమయ్యాడు. 2010, 2010, 2023లో యుఎస్ ఓపెన్‌లో డబుల్స్ ఫైనల్లో దూసుకెళ్లినా నిరాశ తప్పలేదు. కానీ అతడు పట్టువదలకుండా ప్రాక్టీస్ చేస్తునే ఉన్నాడు. ఇక కెరీర్ ముగిసే సమయంలో ఎట్టకేలకు 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఇక సెమీస్ విజయంతోనే బోపన్న టెన్నిస్ ర్యాంకింగ్స్ (Association of Tennis Professionals)లో టాప్ ప్లేస్ కన్ఫార్మ్ అయ్యింది. సోమవారం రిలీజ్ అయ్యే ర్యాంకింగ్స్‌లో బోపన్న నెం.1 స్థానానికి చేరుకోనున్నాడు.