Team India T20 World Cup Jersey:2024 టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో అన్ని జట్లు టోర్నమెంట్‌కు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమ్ఇండియా కొత్త టీ20 జెర్సీని రిలీజ్ చేసింది. ఎప్పటిలాగే ఉన్న బ్లూ జెర్సీకి భుజాలపై ఆరెంజ్ కలర్‌తో కొత్తగా డిజైన్ చేశారు. జెర్సీపై ఇండియా పేరుతోపాటు స్పాన్సర్లు ఆడిడస్, డ్రీమ్ 11 లోగోలు ఉన్నాయి. ఇక ఈ కొత్త జెర్సీతోనే టీమ్ఇండియా ప్లేయర్లు వరల్డ్‌కప్ బరిలో దిగనున్నారు.
హెలికాప్టర్‌తో స్పెషల్‌గా:ఈ జెర్సీని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సమక్షంలో లాంఛ్ చేశారు. వీరు ధర్శశాల మైదానంలో వార్మప్ చేస్తున్న సమయంలో హెలికాప్టర్‌తో గాలిలో జెర్సీని గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ జెర్సీలు మే 7 నుంచి తమ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్‌లో ఫ్యాన్స్ కోసం అందుబాటులో ఉంచనున్నట్లు అడిడస్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కాగా, డ్రీమ్ 11, అడిడాస్ స్పాన్సర్లుగా ఉన్నాయి.
ఇక వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ 15మందితో కూడిన జట్టును రీసెంట్గా ప్రకటించింది. అందులో నలుగురు స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. ఇక రోహిత్ సారథ్యంలో టీమ్ఇండియా పొట్టికప్ బరిలో దిగనుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ వరల్డ్‌కప్‌నకు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. జూన్ 2న ప్రారంభమై 29న ప్రపంచకప్ ముగియనుంది. ఈ టోర్నీలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనుంది.