BCCI Special Gift For T20 World Cup Winners : గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన టీమ్ఇండియాకు తాజాగా బీసీసీఐ ఓ విలువైన బహుమతిని ఇచ్చింది. ఆ జట్టులోని మెంబర్స్‌కు డైమండ్ రింగ్స్‌ను అందించింది. రీసెంట్గా జరిగిన బీసీసీఐ అవార్డుల వేడుకల్లో ప్లేయర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఆ ఉంగరాలను ప్రెజెంట్ చేసింది.
ఈ క్రమంలో తాజాగా ఆ రింగ్స్ గురించి వివరంగా చెబుతూ గురువారం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో నీలం, బంగారు వర్ణంతో ఉన్న ఉంగరంపై భాగంలో టీ20 ప్రపంచ ఛాంపియన్ ఇండియా అనే అక్షరాలను పొందుపరిచారు. అంతేకాకుండా ఆ రింగ్‌పై అశోక చక్రం గుర్తు కూడా ఉండటం విశేషం. ఇక ఉంగరానికి అటు ఇటూ ప్లేయర్ల పేర్లతో పాటు వారి జెర్సీ నంబర్లు, టీమ్‌ఇండియా ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాన్ని సాధించిందో కూడా రాసుంది.
గతంలోనూ భారీ నజరానా :
గతంలోనూటీమ్ఇండియాను ఘనంగా సన్మానించింది బీసీసీఐ. వాంఖడె స్టేడియం వేదికగా భారత జట్టు కోసం ఓ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. అందులో రూ. 125 కోట్ల నగదు బహుమతిని చెక్ రూపంలో అందజేసింది. అంతకుముందు టీమ్మెంబర్స్ అందరూ అభిమానుల నడుమ ర్యాలీగా వాంఖడె చేరుకున్నారు.