Gautam Gambhir Coach:టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి గంభీర్‌నే తొలి ప్రాధాన్యంగా బీసీసీఐ ఎంచుకునే యోచనలో ఉందట. ఈ మేరకు 2024 ఐపీఎల్ ముగిసిన తర్వాత గంభీర్‌తో చర్చలు జరిపేందుకు బీసీసీఐ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గంభీర్ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. దీంతో టీమ్ఇండియా హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించి గంభీర్ అనుభవాన్ని వాడుకోవాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ పోస్ట్‌కు అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. వ్యక్తి ప్రొఫైల్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా కోచ్ ఎంపిక ఉంటుందని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 జూన్‌లో ముగియనుంది.
హెడ్‌కోచ్‌కు అర్హతలు ఇవే:
- కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి.
- కనీసం 30 టెస్టులు/ 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్ల పాటు హెడ్‌కోచ్‌గా వ్యవహరించి ఉండాలి.
- లేదంటే ఐపీఎల్ జట్టు, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీమ్, నేషనల్ ఏ జట్టు ఏదైనా ఒకదానికి కనీసం మూడేళ్ల పాటు హెచ్ కోచ్‌గా పనిచేసి ఉండాలి.