తెలంగాణ

telangana

ETV Bharat / sports

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు ప్రకటన- తెలుగు కుర్రాడికి లక్కీ ఛాన్స్​

ఒకేేసారి రెండు పర్యటనలకు జట్లు ఎంపిక- ప్రకటించిన బీసీసీఐ

Gavaskar Trophy announced
Gavaskar Trophy announced (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Team India Border Gavaskar Trophy Sqaud :2024-25 బోర్డర్ గావస్కర్‌ ట్రోఫీ కోసం బీసీసీఐ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్​కు రోహిత్ సారథ్యం వహించనుండగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. ఇక తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, బౌలర్ హర్షిత్ రానా తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. నవంబర్ 22న ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో టీమ్ఇండియా ఆతిథ్య జట్టుతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇక సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​కు కూడా జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్​గా ఎంపికయ్యాడు.

బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీశ్​ కుమార్ రెడ్డి.

ట్రావెలింగ్ రిజర్వ్ -ముకేశ్ కుమార్, నవ్​దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్

సౌతాఫ్రికా టీ20 సిరీస్​కు భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్​), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేశ్​ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్ , యష్ దయాళ్

కాగా, సౌతాఫ్రికాతో భారత్ 4 టీ20 మ్యాచ్​లు ఆడనుంది. నవంబర్ 8న ఈ సిరీస్​ ప్రారంభం కానుంది.

షెడ్యూల్

  • తొలి టీ20 - నవంబర్ 8 - డర్బన్
  • రెండో టీ20- నవంబర్ 10- సెయింట్ జార్జియ
  • మూడో టీ20- నవంబర్ 13- సెంచూరియన్
  • నాలుగో టీ20- నవంబర్ 15- జొహెన్నస్​బర్గ్​

ABOUT THE AUTHOR

...view details