Ind vs Ban Test Series:బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ సారథ్యంలో 16మందితో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం వెల్లడించింది. ఇక రోడ్డు ప్రమాదం తర్వాత చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్, ఈ సిరీస్‌తో దాదాపు 20నెలల తర్వాత టీమ్ఇండియా టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా ఎ జట్టుపై రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డప్ విఫలమైన సమయంలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 47 బంతుల్లోనే 61 పరుగులతో సత్తా చాటాడు. అందులో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా జట్టులో చోటు దక్కింది.
తొలి అవకాశం
దులీప్ ట్రోఫీ 2024 తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన పేసర్ యశ్ దయాల్ తొలిసారి టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో తన ప్రదర్శనలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన దయాల్ ఈ సిరీస్‌తోనే టెస్టు క్యాప్ అందుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆకాశ్ దీప్ కూడా జట్టులో తన స్థానం నిలుపుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఆకాశ్ తొలి మ్యాచ్‌లోనే వరుస ఇన్నింగ్స్‌ల్లో (4/60), (5/56) అదిరే ప్రదర్శన చేశాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.