తెలంగాణ

telangana

ETV Bharat / sports

180 స్కోర్ చేయడం మాకు తెలీదు!: బంగ్లా కెప్టెన్ - Ind vs Ban T20 2024

Najmul Shanto On Bangladesh Batting : తమ జట్టు బ్యాటింగ్​పై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో అసంతృప్తి వ్యక్తం చేశాడు.

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Shanto On Bangladesh Batting
Shanto On Bangladesh Batting (Source: Associated Press)

Najmul Shanto On Bangladesh Batting :భారత్​తో తొలి టీ20లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్​లో పరుగులు సాధించడానికి బంగ్లా బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్​ మొత్తంలో కనీసం 30 పరుగుల భాగస్వామ్యం నమోదు కాలేదు. ఫలితంగా బంగ్లా 19.5 ఓవర్లలో 127 పరుగులకు కూప్పకూలింది. అనంతరం అదే పిచ్​పై భారత్ 11.5 ఓవర్లలోనే ఈ టార్గెట్ ఛేదించి విజయం ఖాతాలో వేసుకుంది. దీంతో తమ జట్టు బ్యాటింగ్​పై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్​లో కీలక వ్యాఖ్యలు చేశాడు.

'ఈరోజు మా ఆట చెత్తగా ఉందని చెప్పడం లేదు. కానీ, మేం ఇంతకన్నా మెరుగ్గా ఆడగలం. అయితే టీ20ల్లో గత కొంతకాలంగా మా ప్రదర్శన బాగాలేదు. ఏ ఒక్క ప్లేయర్ గురించో నేను ప్రత్యేకంగా మాట్లాడను. అగ్రెషన్​తో కాకుండా ఆలోచనతో బ్యాటింగ్ చేయాలి. ఆ విధంగా మా బ్యాటింగ్​ను మార్చుకుంటాం. మాకు మంచి స్కోర్ సాధించే సామర్థ్యం ఉంది. అయితే గత 10ఏళ్లుగా మేం ఈ విధంగానే బ్యాటింగ్ చేస్తున్నాం. కొన్నిసార్లు మంచి ఫలితాలు వచ్చాయి. కొన్నిసార్లు మార్పులు చేయాల్సి ఉంటుంది. మేం స్వదేశీ పిచ్​ల్లో 140- 150 పరుగులు చేయాడనికే అలవాటు పడ్డాము. అందుకే మ్యాచ్​లో మంచి పరిస్థితులు ఉన్నప్పటికీ 180 పరుగులు స్కోర్ ఎలా చేయాలో మా బ్యాటర్లకు తెలీదు. నేను పిచ్​ను నిందించడం లేదు. కానీ మా నైపుణ్యాలు కాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది' అని షాంటో అన్నాడు.

2ఏళ్లలో నాలుగు సార్లే
గత రెండేళ్లలో బంగ్లాదేశ్ 45 టీ20 మ్యాచ్​లు ఆడగా, అందులో నాలుగు సార్లు మాత్రమే 180 పరుగుల మార్క్ అందుకుంది. ఐర్లాండ్, శ్రీలంక జట్లపై రెండు రెండు సార్లు నమోదు చేసింది. అది కూడా స్వదేశీ పిచ్​లపైనే. అందులో శ్రీలంకతో ఆడిన రెండుసార్లు (2022, 2024) కూడా బంగ్లా ఓటమి పాలైంది. ఇక 2024 టీ20 వరల్డ్​కప్​లోనూ బంగ్లా మెరుగైన ప్రదర్శన చేయలేదు. సూపర్ 8లో ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ ఓడింది.

టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ షో- బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ - India Vs Bangladesh T20

తొలి ఓవరే​ 'మెయిడెన్'- డెబ్యూలోనే మయాంక్ అరుదైన రికార్డ్ - Mayank Yadav Debut

ABOUT THE AUTHOR

...view details