తెలంగాణ

telangana

ETV Bharat / sports

చిక్కుల్లో పాక్​ కెప్టెన్ - కో ప్లేయర్​ను అలా ట్రోల్ చేసి! - T20 World Cup 2024

Babar Azam T20 World Cup : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తాజాగా తన తోటి ప్లేయర్​పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?

Babar Azam T20 World Cup
Babar Azam T20 World Cup (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 11:49 AM IST

Babar Azam T20 World Cup :పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ తమ జట్టు వికెట్ కీపర్ అయిన అజామ్ ఖాన్‌పై తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ అతడ్ని తిట్టిపోస్తున్నారు. అజామ్ ఖాన్‌ను 'గేండా ' అని పిలిచాడని, బొడ్డుగా ఉండేవారినే అలా పిలుస్తారంటూ కామెంట్ చేస్తున్నారు.

టీ20 వరల్డ్​ కప్ ప్రాక్టీస్ సమయంలో ఈ మాట బాబర్ అన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ ఆ వీడియోలో ఆ మాట అంత క్లారిటీగా వినిపించట్లేదని కొంత మంది వాదన.

అయితే కెప్టెన్ నుంచి ఆ మాట రాగానే కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లిపోయిన అజామ్ దాన్ని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదని తెలుస్తోంది. కానీ నెటిజన్లు మాత్రం బాబర్​ను తెగ ట్రోల్ చేస్తున్నారు. తోటి ప్లేయర్​తో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ కామెంట్​ చేస్తున్నారు.

ఇంతకీ అజామ్ ఖాన్ ఎవరంటే ?
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తనయుడు అజామ్ ఖాన్. 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకూ 165 టీ20 మ్యాచ్‌లు ఆడి 3242 పరుగులు స్కోర్ చేశాడు.

పాకిస్థాన్ ప్రస్తుత జట్టులో అజామ్ ఖాన్ హై రేటెడ్ బ్యాట్స్‌మన్. కాకపోతే అతను రీసెంట్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పేలవ ఫామ్​ కనబరిచాడు. అదే ఇప్పుడు అతనిపై విమర్శలకు దారి తీసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా వికెట్ కీపర్​గానూ ఫెయిల్ అవుతున్నాడు అజామ్. రెగ్యూలర్ క్యాచ్‌లను వదిలేయడం కెప్టెన్‌కు తలనొప్పిగా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, అజామ్ ఖాన్ ఫామ్ గురించి రీసెంట్‌గా మీడియా సమావేశంలోనూ బాబర్ మాట్లాడాడు. "మేం ప్లేయర్‌ను సెలక్ట్ చేయకపోతే ఎందుకు సెలక్ట్ చేయలేదని ప్రశ్నిస్తారు. ఒకవేళ అతణ్ని సెలక్ట్ చేసి ఉంటే, ఎందుకు సెలక్ట్ చేశారని ప్రశ్నిస్తారు. సెలక్ట్ అయిన వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని సమాధానమిచ్చాడు.

టీ20 వరల్డ్ కప్ 2022ను రన్నరప్‌గా ముగించిన పాకిస్థాన్ జూన్ 6న యునైటెడ్ స్టేట్స్‌లోని డల్లాస్‌ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక పాకిస్తాన్‌కు చిరకాల ప్రత్యర్థి అయిన టీమిండియాతో జూన్ 9న తలపడనుంది. ఇప్పటికే టోర్నీని విజయంతో ఆరంభించిన ఆతిథ్య జట్టు రెండో మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది.

టీ20లో అరుదైన ఘనత - తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్న సౌతాఫ్రికా బౌలర్ - T20 World Cup 2024

టీమ్​ఇండియా మాజీ కోచ్‌తో బరిలోకి పాకిస్థాన్ - ప్రభావం చూపుతుందా? - T20 World Cup 2024

ABOUT THE AUTHOR

...view details