Tim Southee Retirement : న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్ తన కెరీర్లో ఆఖరిదని సౌథీ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో కివీస్ హామిల్టన్ వేదికగా మూడో టెస్టు ఆడనుంది. కాగా, సౌథీకి అదే ఆఖరి టెస్టు మ్యాచ్ కానుంది. అయితే సౌథీ టెస్టు కెరీర్ ప్రారంభించింది కూడా ఇంగ్లాండ్ మ్యాచ్‌తోనే కావడం విశేషం.
'న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అరుదైన గౌరవం. చిన్నప్పటి నుంచి అదే కలతో పెరిగా. ఆ కలను సాకారం చేసుకోగలిగాను. నా హృదయంలో టెస్టు క్రికెట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. నా టెస్టు కెరీర్ ప్రారంభమైన జట్టుపైనే చివరి మ్యాచ్ ఆడబోతుండటం ఆసక్తికరం. మూడు స్టేడియాలు నాకెంతో స్పెషల్. అందులో హామిల్టన్ మైదానంలో నా చివరి మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా' అని సౌథీ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్ 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించినా జట్టులో సౌథీ మాత్రం ఉండడు.
2008లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సౌథీ దాదాపు 16ఏళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్లో ఇప్పటివరకూ 104 టెస్టులు ఆడిన సౌథీ 385 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లోనూ తన మార్క్ చూపించిన టిమ్ 2,185 పరుగులు చేశాడు. ఇక 161 వన్డేల్లో 221, 125 టీ20ల్లో 164 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2011 నుంచి ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు ఆడిన సౌథీ, 54 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీశాడు. కాగా, గతనెల సౌథీ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా వదులుకున్నాడు.
New Zealand cricket great Tim Southee plans to finish his Test career at his home ground of Seddon Park in Hamilton against England this December. https://t.co/L0li6zMeAT
— BLACKCAPS (@BLACKCAPS) November 14, 2024