తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిచెల్‌ మార్ష్ ప్లేస్​లో ఆరున్నర అడుగుల ఆల్‌రౌండర్ - ఎవరీ వెబ్‌స్టర్? - BGT 2025 AUSTRALIA PLAYING 11

బోర్డర్ గావస్కర్ చివరి టెస్ట్​ - ఆస్ట్రేలియా జట్టులో మార్పులు - మిచెల్‌ మార్ష్ ప్లేస్​లో మరో ఆర్​ రౌండర్

BEAU WEBSTER AUSTRALIA
BGT 2025 Australia Playing 11 (GETTY IMAGES)

By ETV Bharat Sports Team

Published : Jan 2, 2025, 12:39 PM IST

BGT 2025 Australia Playing 11 : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న ఐదో టెస్టు కోసం ఆస్ట్రేలియా తాజాగా తమ తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఇబ్బందిపడుతున్న స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్​ విశ్రాంతి తీసుకోనున్నాడని, అయితే అతడి స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. బ్యూ వెబ్‌స్టర్‌ అనే యంగ్ ప్లేయర్​ ఈ మ్యాచ్​ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉండగా, ఒకే సిరీస్‌లో ఆసీస్‌ తరఫున ముగ్గురు కొత్త ఆటగాళ్లు టెస్టుల్లో డెబ్యూ చేయడం గమనార్హం. ఇప్పటికే మెక్‌స్వీనీ, సామ్‌ కొన్‌స్టాస్‌ ఆడగా, ఇప్పుడు వారితో పాటు బ్యూ వెబ్​స్టార్​ అద్భుతాలు సృష్టించనున్నాడు. ఇప్పటికే 2-1 ఆధిక్యంతో కొనసాగుతున్న ఆసీస్ ఇక్కడా గెలిచి పదేళ్ల తర్వాత స్వదేశంలో బోర్డర్​ గావస్కర్ ట్రోఫీని దక్కించుకోవాలని ఉవ్విళ్లురుతోంది. అయితే టీమ్‌ఇండియా మాత్రం ఈ సిరీస్‌ను సమం చేసి స్వదేశానికి వెళ్లాలని భావిస్తోంది.

ఫస్ట్‌క్లాస్‌లో అదుర్స్!
స్టార్‌ ఆల్‌రౌండర్, టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను తప్పించడం వెనక గాయమని చెబుతున్నాప్పటికీ అతడి ఫామ్‌ ప్రధాన కారణమంటూ క్రికెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నాలుగు టెస్టుల్లో అతడు కేవలం 73 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో తనకు బదులు దేశవాళీలో అదరగొట్టిన 31 ఏళ్ల వెబ్‌స్టర్​పై ఆసీస్‌ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది.

ఇక 1993 డిసెంబర్ 1న హోబర్ట్‌లో జన్మించాడు. 2014లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడీ యంగ్ ప్లేయర్. టాస్మానియా తరఫున కేవలం 93 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లోనే 5,297 పరుగులు చేసి అబ్బురపరిచాడు. ఇందులో 12 సెంచరీలు ఉండటం గమనార్హం. ఇటు బౌలర్‌గానూ 148 వికెట్లు తీసి సత్తా చాటాడు.

అందనంత 'ఎత్తు'
ఇదిలా ఉండగా, నాలుగేళ్ల క్రితం వరకూ ఆఫ్‌స్పిన్నర్‌గా ఉన్న వెబ్‌స్టర్ ఆ తర్వాత సీమ్‌ బౌలింగ్‌ వైపుకు అడుగులేశాడు. అతడు దాదాపు 2 మీటర్ల ఎత్తు ఉంటాడు. అంటే ఆరున్నర అడుగులు. అయితే వెబ్‌స్టర్ మీడియం పేసర్‌గా మారేందుకు ఎంతో శ్రమించాడు. తన పెర్ఫామెన్స్​తో టాస్మానియా జట్టులో స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.

మరోవైపు గత మూడు సీజన్ల నుంచి మిడిలార్డర్‌లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ చేయడంతో పాటు స్టార్ పేసర్‌గా వికెట్లూ అందించాడు. భారత్‌ Aతో ఆస్ట్రేలియా A సిరీస్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. టీమ్‌ఇండియాతో అడిలైడ్‌ వేదికగా జరిగిన టెస్టులోనే అరంగేట్రం చేస్తాడని అంతా ఊహించారు. అప్పటి నుంచే నేషనల్ టీమ్​లోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఇప్పుడీ సిడ్నీ టెస్టుకు ఎంపిక కావడంపై వెబ్‌స్టర్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏం చేయాలన్నా తాను సిద్ధమేనంటూ పేర్కొన్నాడు. గత పదేళ్లుగా చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని వెబ్​స్టర్​ అన్నాడు.

ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే :
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, బ్యూ వెబ్‌స్టర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్, అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్

'బుమ్రా లేకపోతే వార్ వన్​సైడే'- ఆసీస్ లెజెండ్ కామెంట్స్

క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన - కెప్టెన్​గా బుమ్రా! - టెస్ట్​ టీమ్​ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్​!

ABOUT THE AUTHOR

...view details