Aus vs Wi 2nd Test:ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. ఆసీస్ కంచుకోట గబ్బా మైదానంలో జరిగిన రెండో టెస్టులో విండీస్ 8 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో వెస్టిండీస్ 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. విండీస్ పేసర్ షామర్ జోసెఫ్ 7 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి, తమ జట్టుకు టెస్టుల్లో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో డ్రా గా ముగిసింది.
215 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ క్రమంగా వికెట్లో కోల్పోయింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 పరుగులు) ఒక్కడే పోరాడాడు. అతడికి కామెరూన్ గ్రీన్ (42 పరుగులు) మాత్రమే సహకారం అందించాడు. ఉస్మాన్ ఖవాజా (10), మార్నస్ లబుషేన్ (5), మిచెల్ మార్ష్ (10), అలెక్స్ కేరీ (2) విఫలమయ్యారు. స్టార్ ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరగడం విశేషం.
గబ్బాలో ఆసీస్ రికార్డ్: బ్రిస్బేన్ గబ్బా మైదానంలో ఆసీస్‌కు ఘనమైన రికార్డ్ ఉంది. టెస్టుల్లో గబ్బా మైదానం ఆసీస్‌కు కంచుకోట లాంటింది. అలాంటి గబ్బాలో గ్రౌండ్లో ఆసీస్ చివరిసారిగా 2021 జనవరిలో భారత్‌పై ఓడగా, తాజాగా విండీస్ చేతిలో భంగపడింది.