Ashutosh Sharma PBKS :అహ్మదబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అత్యుత్తమ పెర్ఫామెన్స్ కనబరిచింది. గుజరాత్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా యువ క్రికెటర్లు ఊహకందని విజయాన్ని సాధించి పెట్టారు. ఇక గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకడు అశుతోష్ శర్మ. రెండో ఇన్నింగ్స్‌లో పంజాబ్ చిక్కుల్లో పడి ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశుతోష్ ప్రత్యర్థులపై విరుచుకు పడ్డాడు మరో 50 పరుగులు చేస్తేనే కానీ, జట్టు గెలుపొందదు అన్న సమయంలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గుజరాత్ బౌలింగ్ అటాక్ ను తట్టుకున్నాడు. 3 ఫోర్లు 1 సిక్సుతో చెలరేగి 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
ఎవరీ అశుతోష్ :
ఇండోర్‌లో పెరిగిన ఈ యువ క్రికెటర్ మధ్యప్రదేశ్ తరఫున తరఫున ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. 16 సంవత్సరాల క్రితం టీ20 క్రికెట్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. అక్టోబర్ 2023లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ సి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశుతోష్ కేవలం 11 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టడం ద్వారా ఈ ఫీట్‌ను సాధించాడు. యువరాజ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా అశుతోష్ 11 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఈ రికార్డ్ నమోదు చేశాడు. అప్పట్లో అశుతోష్ రైల్వేస్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు.
తన కెరీర్‌లో ఇప్పటివరకు 4 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ A గేమ్‌లు మరియు 15 T20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సీజన్ కు ముందు జరిగిన వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది పంజాబ్. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతను ఇంపాక్ట్ సబ్‌గా అరంగేట్రం చేశాడు.