Arshad Nadeem Olympics Car : పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి ముద్దాడిన జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్‌కు అటు ప్రశంసలతో పాటు ఇటు రివార్డుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు నదీమ్‌కు భారీ రివార్డులు ప్రకటించగా, తాజాగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్సు తొలి ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఆయన్ను గ్రాండ్‌గా సత్కరించారు.
తాజాగా నదీమ్ స్వగ్రామానికి వెళ్లిన ఆమె అతడ్ని కలిసి అభినందించారు. రూ.10 కోట్ల రివార్డును అందజేయడంతో పాటు హోండా సివిక్ కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ కారుకున్న ప్రత్యేకత ఏంటంటే పారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ నమోదు చేసిన 92.97 మీటర్లు రికార్డుకు గుర్తుగా ఆమె ఆ కారు నెంబర్ ప్లేట్‌ను PAK 92.97గా రూపొందించి నదీమ్‌కు బహుకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక అర్షద్ నదీమ్ ప్రతిభను మెచ్చిన ప్రముఖ పాకిస్థాన్ సింగర్ అలీ జఫర్ PKR 1 మిలియన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంతే మొత్తాన్ని నదీమ్‌కు తన ఫౌండేషన్ ద్వారా ఇవ్వనున్నట్లు క్రికెటర్ అహ్మద్ షాదాజ్ వెల్లడించారు.
స్పోర్ట్స్ స్టేడియానికి అర్షద్ పేరు -మరోవైపు, సుక్కురులోని కొత్త స్పోర్ట్స్ స్టేడియానికి నదీమ్ పేరు పెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు, కరాచీలో అర్షద్ నదీమ్ అథ్లెటిక్స్ అకాడమీని ప్రారంభించనున్నట్లు నగర మేయర్ ముర్తుజా వహబ్ వెల్లడించారు. నదీమ్‌కు సోలార్ ఎనర్జీ సిస్టమ్‌ను అందించనున్నట్లు అక్కడి ప్రముఖ సోలార్ ఎనర్జీ కంపెనీ బీకన్ ఎనర్జీ ప్రకటించింది.
కష్టాలను ఎదురొడ్డి గోల్ట్ మెడల్ -ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా, మరోవైపు శిక్షణ కష్టాలను దాటి అర్షద్ నదీమ్ గోల్ట్ మెడల్ కొట్టాడు. పారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్లు జావెలిన్ విసిరి పాకిస్థాన్‌కు పతకాన్నిఅందించాడు. ఇక వ్యక్తిగత విభాగంలో ఆ దేశం నుంచి స్వర్ణ పతకం గెలిచిన తొలి అథ్లెట్ అర్షదే. దీంతో అతడిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అర్షద్‌కు స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.
డైట్ దొరికేది కాదు, తుప్పు పరికరాలతో ప్రాక్టీస్! - ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ అర్షద్ నదీమ్ జర్నీ - Paris Olympics 2024 Arshad Nadeem
బాబర్ స్ట్రైక్ రేట్ కన్నా అర్షద్ జావెలిన్ డిస్టెన్సే ఎక్కువ! ఆజమ్‌పై ఫుల్ ట్రోల్స్ - Arshad Nadeem Babar Azam