తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో సంచలనం - 4 బంతుల్లో 4 వికెట్లు - డబుల్ హ్యాట్రిక్ తీసిన పేసర్ - 4 BALLS 4 WICKETS RECORD

టీ20ల్లో అర్జెంటీనా పేసర్ రికార్డు - వరుసగా 4 బాల్స్ లో 4 వికెట్లు.

4 Balls 4 Wickets Record
4 Balls 4 Wickets Record (source IANS)

By ETV Bharat Sports Team

Published : Dec 17, 2024, 4:04 PM IST

4 Balls 4 Wickets Record : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ అమెరికా క్వాలిఫైయర్​లో అర్జెంటీనా బౌలర్ హెర్నాన్ ఫెన్నెల్ చరిత్ర సృష్టించాడు. కేమన్ ఐలాండ్స్‌ టీమ్ పై వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ క్రమంలో టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఆరో బౌలర్​గా నిలిచాడు.

నాలుగు బంతుల్లో 4 వికెట్లు

వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు తీస్తే క్రికెట్​లో దాన్ని డబుల్ హ్యాట్రిక్​గా పిలుస్తారు. డిసెంబరు 15న కేమన్ ఐలాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో హెర్నెన్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఖరి ఓవర్ మూడో బంతికి ట్రాయ్ టేలర్‌, తర్వాతి మూడు బంతుల్లో అలెస్టర్ ఇఫిల్, రోనాల్డ్ ఎబాంక్స్, అలెజాండ్రో మోరిస్​ల వికెట్లను తీసి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్​లో ఫెన్నెల్ 14 పరుగులిచ్చి మొత్తం 5 వికెట్లు తీశాడు. అయినప్పటికీ అర్జెంటీనా జట్టు మ్యాచ్​లో ఓడిపోయింది. కేమన్ ఐలాండ్స్ 116 పరుగులు చేసింది. అర్జెంటీనా 94 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఈ మ్యాచ్​లో అర్జెంటీనా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.

అంతర్జాతీయ టీ20 క్రికెట్​లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు

1. రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్)- ఐర్లాండ్, 2019

2. లసిత్ మలింగ (శ్రీలంక)- న్యూజిలాండ్. 2019

3. కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్)- నెదర్లాండ్స్, 2021

4. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్)- ఇంగ్లాండ్, 2022

5. వాసిమ్ యాకూబ్ (లెసోతో)- మాలి, 2024

6. హెర్నాన్ ఫెన్నెల్ (అర్జెంటీనా)- కేమన్ ఐలాండ్స్, 2024

ఇంతకుముందు, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ అమెరికాస్ రీజినల్ క్వాలిఫైయర్ 2021లో పనామాపై ఫెన్నెల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. తాజాగా జరిగిన మ్యాచ్​లోనూ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో టీ20 క్రికెట్​లో ఒకటి కన్నా ఎక్కువ హ్యాట్రిక్​లు సాధించిన ఆరో బౌలర్​గా నిలిచాడు అర్జెంటీనా పేసర్ హెర్నాన్ ఫెన్నెల్. ఇప్పటి వరకు వసీం అబ్బాస్, పాట్ కమిన్స్, మార్క్ పావ్లోవిచ్, టిమ్ సౌథీ, లసిత్ మలింగ మాత్రమే ఒకటి కన్నా ఎక్కువ హ్యాట్రిక్​లు తీశారు.

హమ్మయ్యా! - భారత్‌కు తప్పిన ఫాలో ఆన్‌ గండం!

ఈ క్రికెటర్లు బోర్డర్ గావస్కర్​తోనే టెస్ట్ కెరీర్ ముగించారు - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details