Anrich Nortje T20 World Cup :సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నార్జే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకతో సోమవారం (జూన్ 3) జరిగిన మ్యాచ్‌లో 4-0-7-4 గణాంకాలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో తన పాత రికార్డును తానే బ్రేక్ చేశాడు.
2022లో బంగ్లాదేశ్‌తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 3.3-0-10-4గా రికార్డు ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో 4-0-7-4 గణాంకాలు నమోదు చేశాడు. అలా టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సార్లు వికెట్లు పడగొట్టి డేల్ స్టెయిన్ రికార్డు బ్రేక్ చేయడానికి 7 వికెట్ల దూరంలో మాత్రమే నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా బౌలర్ల బెస్ట్ రికార్డులు:
ఎన్రిచ్ నార్జే: 4-0-7-4 శ్రీలంకతో మ్యాచ్‌లో, న్యూయార్క్, 2024
ఎన్రిచ్ నార్జే: 3.3-0-10-4 బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో, సిడ్నీ, 2022
వేనె పార్నెల్: 4-0-13-4, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో, ద ఓవల్, 2009
జాక్వెస్ కల్లీస్: 4-1-15-4 జింబాబ్వేతో మ్యాచ్‌లో, హంబంతోట, 2012
మోర్న్ మార్కెల్: 4-0-17-4 న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో, దర్బన్, 2007
శ్రీలంక మ్యాచ్‌లో ఎన్రిచ్ నార్జే:
శ్రీలంకతో సౌతాఫ్రికా బెస్ట్ ఇన్నింగ్స్ ఆడటానికి నార్జే కీలకంగా వ్యవహరించాడు. 19.1 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌట్ అయింది లంక టీం. శ్రీలంక టీ20ల్లోనే అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసినట్లు అయింది. శ్రీలంక జట్టులోని కీలక వికెట్లు అయిన కుశాల్ మెండీస్, కామిందు మెండీస్, చరిత్ ఆశలంక, ఏంజిలె మాథ్యూస్‌లను పెవిలియన్ బాట పట్టించాడు.
కగిసో రబాడ, కేశ్ మహారాజ్‌ల సహకారంతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాడు నార్జే. ఒట్నీల్ బార్ట్‌మన్ కూడా ఓపెనర్ అయిన పాతమ్ నిస్సంకా వికెట్ పడగొట్టి 4-1-9-1తో శుభారంభాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మార్కో జాన్సేన్ ఒక్కడే ఒక్క వికెట్ కూడా తీయకుండా మ్యాచ్ ముగించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో తన తొలి మ్యాచ్‌ను విజయంతో ఆరంభించింది సౌతాఫ్రికా. గ్రూప్ డీ జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా తన తర్వాతి మ్యాచ్‌లను జూన్ 8న నెదర్లాండ్స్‌తో, జూన్ 10న బంగ్లాదేశ్‌తో, జూన్ 15న నేపాల్‌తో ఆడుతుంది.
సౌతాఫ్రికా శుభారంభం - నోకియా మెరుపులకు లంక చిత్తు - 2024 T20 World Cup
వరల్డ్‌కప్ టీమ్: అనౌన్స్మెంట్ ముందు, తర్వాత- బ్యాటర్ల పెర్ఫార్మెన్స్ - T20 World Cup 2024