Nita Ambani Praises Rohith Sharma Hardik in Anant Ambani Sangeeth Celebrations : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లి మరి కొద్ది రోజుల్లో జరగనుంది. ఈ వేడుకలో అంబానీ కుటుంబం ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి.
తాజాగా సంగీత్ సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కియారా ఆడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె, అలియాభట్-రణ్‌బీర్ కపూర్‌తో పాటు మజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2024 విన్నింగ్ టీమ్ భారత జట్టులోని కొంతమంది ప్లేయర్స్ కూడా హాజరై సందడి చేశారు.
అయితే ఈ వేడుకలో వరల్డ్ కప్ విన్నింగ్ హీరోలైన క్రికెటర్లను ప్రత్యేకంగా అభినందించారు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యకు గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టి తీయించారు.
అనంతరం క్రికెటర్లు, నీతా అంబానీతో కలిసి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని హారతి అందుకున్నారు. ఆ తర్వాత క్రికెటర్లను ఒకరి తర్వాత మరొకరిని స్టేజ్‌పై పిలిచి మరీ ఫైనల్ మ్యాచ్‌లో వారి ప్రదర్శనను గుర్తు చేస్తూ ప్రశంసించారు నీతా అంబానీ.