498 Runs In An Innings :గుజరాత్‌కు చెందిన యువ క్రికెటర్ ద్రోణ దేశాయ్(18) స్థానిక టోర్నమెంట్లో విధ్వంసం సృష్టించాడు. దివాన్ బల్లూభాయ్ కప్ అండర్- 19 మల్టీ డే టోర్నమెంట్లో ఏకంగా 498 పరుగులు బాది ఔరా అనిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 86 ఫోర్లు, 7 సిక్సర్లతో రప్ఫాడించాడు. ఈ టోర్నీలో సెయింట్ జేవియర్స్ స్కూ్ల్కు ప్రాతినిథ్యం వహించిన ద్రోణ దేశాయ్, జేఎల్ ఇంగ్లీష్ స్కూల్‌పై మారాథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. త్రుటిలో 500 పరుగుల మార్క్‌ను చేజార్చుకున్నాడు.
వీరబాదుడు
గాంధీనగర్‌లోని శివాయ్ క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం సెయింట్ జేవియర్స్ స్కూల్ - జేఎల్ స్కూల్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ద్రోణ దేశాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో జేవియర్స్ జట్టు 844 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 845 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జేఎల్ ఇంగ్లీష్ స్కూల్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 712 పరుగుల తేడాతో సెయింట్ జేవియర్స్ ఘన విజయాన్ని అందుకుంది.
'నాకు ఆది తెలియలేదు'
అయితే 500 పరుగుల చేసే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ద్రోణ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గ్రౌండ్‌లో స్కోర్ బోర్డ్ లేదు. నేను 498 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నానని జట్టు తెలియదు. దీంతో స్ట్రోక్ ఆడటానికి వెళ్లి ఔటయ్యాను. కానీ, నేను చేసిన పరుగుల పట్ల సంతోషంగా ఉన్నాను. నేను ఏడేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. నేను మంచి క్రికెటర్‌గా మారాలనేది మా నాన్న కల. 40 మందికి పైగా క్రికెటర్లకు కోచ్‌గా పనిచేసిన జేపీ సర్ (జయప్రకాశ్ పటేల్) వద్దకు నన్ను తీసుకెళ్లాడు. ఆయనే దగ్గరే శిక్షణ పొందాను. 8-12వ తరగతి వరకు కేవలం పరీక్షల సమయంలోనే స్కూల్ కు వెళ్లాను' అని దేశాయ్ చెప్పుకొచ్చాడు.