Afg vs Aus World Cup 2024:2024 టీ20 వరల్డ్‌కప్ సూపర్- 8లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత అఫ్గానిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఓటమికి తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ బలమైన ఆస్ట్రేలియా జట్టుపై ఆల్‌రౌండ్ ఆధిపత్యం చలాయిస్తూ 21 పరుగుల తేడాతో నెగ్గి చారిత్రక విజయాన్ని అందుకుంది.
దీంతో అఫ్గానిస్థాన్ ప్లేయర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంబరాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. మ్యాచ్ అనంతరం మైదానంలో ప్రారంభమైన అఫ్గాన్ ఆటగాళ్ల సంబరాలు టీమ్ బస్సులోనూ కొనసాగాయి. జట్టు కోచ్ డ్వేన్ బ్రావో 'ఛాంపియన్' పాటకు ప్లేయర్లంతా బస్సులోనే స్టెప్పులేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రౌండ్ నుంచి హోటల్‌కు వెళ్తున్న బస్సులో అఫ్గాన్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అఫ్గాన్‌లోనూ సంబరాలు:ఈ సంచలన విజయం తర్వాత అఫ్గానిస్థాన్ దేశంలోనూ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అఫ్గాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లో క్రికెట్ ఫ్యాన్స్ తమ ప్లేయర్ల విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేచ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.