Nigeria Vs Ivory Coast T20 World Cup : కేవలం 7 పరుగులకే ఓ జట్టు ఆలౌటైంది. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. ఇంతకీ ఆ జట్లు ఏదో, వాళ్లు అలా ఎందుకు ఔట్ అయ్యరో ఈ స్టోరీలో చూద్దాం.
లాగోస్ వేదికగా తాజాగా జరిగిన ఐసీసీ పురుషుల T20 ప్రపంచకప్‌లో ఈ ఘటన జరిగింది. సబ్-రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ గ్రూప్ C మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై నైజీరియా కేవలం 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన నైజీరియా తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 271 పరుగులు నమోదుచేసింది. ఇక నైజీరియా ఓపెనర్ సలీం సలావ్ 112 పరుగుల భారీ ఇన్నింగ్స్ నమోదు చేయగా, మిడిలార్డర్‌లో వచ్చిన ఇసాక్ ఒపెక్ 65 పరుగులు చేశాడు. అలా ఆ జట్టు ఐవరీకోస్ట్ ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అయితే నైజీరియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన ఐవరీ కోస్ట్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. 4 పరుగుల స్కోర్ ఉన్నప్పుడే మొదటి 2 వికెట్ల పడిపోయాయి. ఆ తర్వాత మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ 5 పరుగుల వద్ద పెవిలియన్ బాటపట్టారు. ఇక 6 పరుగుల వద్ద ఐవరీకోస్ట్ చేతులెత్తేసింది. ఇక 7.3 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌట్‌గా వెనుతిరిగింది. మరో ముగ్గురు బ్యాట్లరు కూడా తమ వికెట్లను వరుసగా కోల్పోయారు.