2025 Champions Trophy India:పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 1996 తర్వాత తొలిసారి ఐసీసీ ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందింది. ఈ నేపథ్యంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. ఇందులో భాగంగా పాక్ సహా టోర్నీలో పాల్గొననున్న మరో 7జట్లు పాకిస్థాన్ వెళ్లాల్సి ఉంది. అయితే భద్రత కారణాల దృష్యా టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదిక (దుబాయ్, శ్రీలంక)ల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేయాలని బీసీసీఐ ఐసీసీకి విజ్ఞప్తి చేయనుంది.
ఈ క్రమంలోనే బీసీసీఐ వచ్చే వారం కొలొంబోలో జరగనున్న ఐసీసీ సమావేశంలో బోర్డు అధికారుల ముందు ఈ విషయాన్ని ప్రస్తావించనుంది. అయితే గతేడాది పాకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో కూడా టీమ్ఇండియా హైబ్రిడ్ మోడల్లోనే ఆడింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకకు మార్చింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అదే మోడల్లో భారత్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ కోరనుంది.
అయితే బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికలు దుబాయ్ లేదా శ్రీలంక మైదానాల్లో జరగడం ఖాయం. ఒకవేళ ఈ హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం తెలుపకపోయినా, టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లకపోయినా ఏంటి పరిస్థితి? భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా?