2007 India Vs Pakistan Bowl Out :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్లో జట్టుకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు. ఓ ప్లేయర్‌గా, అలాగే ఓ కెప్టెన్‌గానూ జట్టును ముందుండి నడిపించారు. అయితే సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజున ధోనీ శకం మొదలైంది. ఇక్కడే తన సారధ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి జట్టును విశ్వవిజేతగా నిలిపాటు. ఓటమి పాలవ్వాల్సిన పోరును గెలుపు బాట పట్టించాడు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే?
2007 టీ20 ప్రపంచకప్‌నకు అప్పటి సీనియర్ ప్లేయర్స్ దూరంగా ఉండటం వల్ల యంగ్ ప్లేయర్స్‌తో ఓ కొత్త టీమ్‌ను తయారు చేశారు సెలక్టర్లు. దానికి ధోనీని కెప్టెన్‌గా చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకుగానూ 141 పరుగులు స్కోర్ చేసింది. రాబిన్ ఊతప్ప (50) అర్ధ శతకంతో రాణించగా, అతడితో పాటు ధోనీ(33) జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ ఆసిఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, షాహిద్ అఫ్రిది రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. యాసిర్ అర్ఫత్, సోహైల్ తన్వీర్ కూడా చెరో వికెట్ తీసారు.