హలో క్రికెట్ లవర్స్ - ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా? - Cricket Interesting Facts - CRICKET INTERESTING FACTS
Cricket Interesting Facts : మన దేశంలో క్రికెట్ అభిమానులు చాలా ఎక్కువ. వీరభిమానులు చాలా మంది దాదాపు ప్రతి మ్యాచ్ ఫాలో అవుతుంటారు. అయినా చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటంటే?
Cricket Interesting Facts (Source : Getty Images)
Published : Sep 23, 2024, 9:43 PM IST
Cricket Interesting Facts :ప్రపంచంలో క్రికెట్‌ని ఇష్టపడే దేశాలు చాలా ఉన్నాయి. వీటిల్లో భారత్ మాత్రం ప్రత్యేకం. ఇంగ్లాండ్‌లో మొదలైన ఈ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా అందరి హృదయాలను దోచుకుంది. మీరు చాలా కాలంగా క్రికెట్‌ని ఫాలో అవుతున్నా లేదా కొత్తగా అభిమానిగా మారినా అందరికీ తెలియని విషయాలు తెలుసుకోవడం సరదగా ఉంటుంది. ఇప్పుడు క్రికెట్‌కి సంబంధించి ఆశ్చర్యపరిచే ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
- తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ : మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారతదేశం లేదా ఆస్ట్రేలియా వంటి ప్రసిద్ధ జట్లు పాల్గొనలేదు. 1844లో న్యూయార్క్‌లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్‌లో USA vs Canada మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో కెనడా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- 500 సంవత్సరాల చరిత్ర : క్రికెట్‌కు గొప్ప చరిత్ర ఉంది. 16వ శతాబ్దం మధ్యకాలంలో ఈ గేమ్ మొదలైంది. ఇంగ్లాండ్‌లో ప్రారంభమై ఆ దేశ జాతీయ క్రీడగా మారింది. అంటే దాదాపు 500 ఏళ్లనాటి క్రితమే బ్యాట్, బాల్ పుట్టాయి.
- తొలి ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ : ఉమెన్స్ క్రికెట్‌కు కూడా సుదీర్ఘ చరి త్ర ఉంది. మొట్టమొదటిసారిగా మహిళల క్రికెట్ మ్యాచ్ 1745లో ఇంగ్లాండ్‌లోని సర్రేలో జరిగింది. అది దాదాపు 300 సంవత్సరాల క్రితం!
- ఒలింపిక్స్ పోటీలో ఫ్రాన్స్ : 1900లో ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగంగా ఉంది. పోటీ పడిన రెండు జట్లలో ఫ్రాన్స్ ఒకటి. అయితే ఫ్రెంచ్ వైపు ఉన్న ఆటగాళ్లందరూ నిజానికి ఫ్రెంచ్ వారు కాదు. అప్పటి నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ జరగలేదు.
- దురదృష్టకరమైన నంబర్ : క్రికెట్‌లో 111 నంబర్‌ని తరచుగా దురదృష్టకరం గా చూస్తారు. దీన్ని నెల్సన్ నంబర్ అని పిలుస్తారు. క్రికెట్‌లో జట్టు లేదా ఆటగాడు 111 పరుగులకు చేరుకున్నప్పుడు వికెట్ పడిపోతుందని నమ్ముతారు. దీనికి అడ్మిరల్ నెల్సన్ పేరు పెట్టారు. అతడు ఓ ప్రమాదంలో ఒక కన్ను, ఒక చేయి కోల్పోయాడు. ఈ నంబర్‌ను అంపైర్ డేవిడ్ షెపర్డ్ వల్ల పాపులర్ అయ్యింది. జట్టు స్కోరు 111 లేదా దాని మల్టిపుల్ (ఉదా. 222 లేదా 333) అయినప్పుడల్లా అతడు ఒక కాలు మీద గెంతేవాడు. 2011 నవంబర్ 11న ఉదయం 11:11 గంటలకు ఆస్ట్రేలియాను ఓడించేందుకు దక్షిణాఫ్రికా 111 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో డేవిడ్ షెపర్డ్, ప్రేక్షకులు ఒక్క కాలిపై నిల్చున్నారు.
- వేగవంతమైన బంతి : 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్'గా పాపులర్ అయిన పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బాల్ వేసి రికార్డు క్రియేట్ చేశాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.3 km/h (100.2 mph) వేగంతో బౌలింగ్ చేశాడు.
- సుదీర్ఘమైన క్రికెట్ మ్యాచ్ : 1939 మార్చిలో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ ఒక టెస్టు మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ ఏకంగా 9 రోజుల పాటు కొనసాగింది. అంత సమయం ఉన్నప్పటికీ మ్యాచ్ డ్రా గా ముగిసింది.
- అత్యధిక టెస్టు స్కోరు : టెస్టు చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 400 పరుగులు చేశాడు.
- అంపైర్లు బెయిల్స్ తీసివేయవచ్చు : గాలులు ఎక్కువ బలంగా వీస్తున్న సమయంలో, గాలికి ఎగిరిపోకుండా ఉండేందుకు క్రికెట్ అంపైర్లు బెయిల్స్‌ని తొలగించవచ్చు.
- పాపులర్ క్రికెట్ లీగ్ : భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యధిక పాపులారిటీ సొంతం చేసుకున్న క్రికెట్ లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నిలిచింది. ప్రజాదరణ పరంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని స్పోర్ట్స్ లీగ్‌లలో 6వ స్థానంలో ఉంది.
- మారని పిచ్ : క్రికెట్ పుట్టినప్పటినుంచి ఆటలో చాలా రూల్స్ మారాయి. కానీ, 22 గజాల క్రికెట్ పిచ్ పొడవు మాత్రం ఆట ప్రారంభ రోజుల నుంచి అలాగే ఉంది.
- చెత్త బ్యాటర్ : న్యూజిలాండ్ ఆటగాడు క్రిస్ మార్టిన్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. అతడి బ్యాటింగ్ యావరేజ్ చాలా తక్కువగా ఉంది. 71 మ్యాచుల్లో 2.36 యావరేజ్‌తో 123 పరుగులు మాత్రమే చేశాడు.
- వరల్డ్ ఫేమస్ స్పోర్ట్ : క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. సాకర్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా నిలిచింది. భారతదేశం, ఆస్ట్రేలియా, యూకేలో భారీగా అభిమానులు ఉన్నారు.