తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

"న్యూ ఇయర్​ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే - సంవత్సరమంతా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి"! - BEST COLOURS TO WEAR ON NEW YEAR

-కొత్త ఏడాది తొలిరోజున ధరించాల్సిన రంగులు ఇవే - సూచిస్తున్న జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​

Best Colours to Wear on January 1
Best Colours to Wear on January 1 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 4:21 PM IST

Best Colours to Wear on New Year: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం (2025) ప్రారంభం రానుంది. ఈ క్రమంలో జనవరి 1వ తేదీన చాలా మంది కొత్త దుస్తులు ధరిస్తుంటారు. నచ్చిన కలర్స్ ధరించి​ ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి ఎంజాయ్​ చేస్తుంటారు. ఆ సంవత్సరం మొత్తం బాగుండాలని దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటుంటారు. అయితే.. న్యూ ఇయర్​ రోజున ఈ కలర్​ దుస్తులు ధరిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం వరిస్తుందని.. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ బుధవారం వచ్చిందని.. ఆ వారానికి అధిపతి బుధుడు అని మాచిరాజు చెబుతున్నారు. నవగ్రహాల్లో బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తాడని.. కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయనకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించమని చెబుతున్నారు. ఒకవేళ ఆ రంగు దుస్తులు ధరించలేని వారు కనీసం ఆకుపచ్చ కలర్​ కలిగిన కర్ఛీప్​ను అయినా దగ్గర పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. దీని వల్ల బుధ బలం పెరుగుతుందని.. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన పురోగతి లభిస్తుందని చెబుతున్నారు.

ఈ రంగు కూడా: కాగా, జనవరి 1వ తేదీన ఆకుపచ్చ వస్త్రాలు కాకుండా మరో రంగు దుస్తులు కూడా ధరించవచ్చని మాచిరాజు కిరణ్​ చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు ధరిస్తే.. సంఖ్యా శాస్త్రం ప్రకారం మరో రంగు దుస్తులు వేసుకోవచ్చని వివరిస్తున్నారు. జనవరి 1, 2025 అంటే 0+1+0+1+2+0+2+5=11, 1+1=2. దీనిని డెస్టినీ నెంబర్​ అంటారంటున్నారు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. సంఖ్యా శాస్త్రంలో ఆత్మ సంఖ్య(డెస్టినీ నెంబర్​)కు అంతే ప్రాధాన్యం ఉందంటున్నారు.

ఈ లెక్క ప్రకారం జనవరి 1, 2025వ తేదీని కలిపినప్పుడు మొత్తం సంఖ్య రెండు వచ్చింది కాబట్టి.. 2 అనేది చంద్రుడి అంకె అని.. ఆయనకు తెలుపు అంటే ఇష్టం కావడం వల్ల.. న్యూ ఇయర్​ రోజు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు జ్యోతిష్యం ప్రకారం ఆకుపచ్చ రంగు లేదా సంఖ్యా శాస్త్రం ప్రకారం తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని మాచిరాజు సూచిస్తున్నారు.

జనవరి 1 దర్శించాల్సిన ఆలయాలు ఇవే:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు కూడా అధిష్ఠాన దేవతలు ఉంటారని.. అలాగే బుధగ్రహానికి కూడా ఇద్దరు అధిష్ఠాన దేవతలు ఉన్నారని.. ఒకరు గణపతి.. మరొకరు విష్ణుమూర్తి అని అంటున్నారు. కాబట్టి జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజు గణపతి ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయాలను దర్శించుకోవాలని చెబుతున్నారు.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మాస శివరాత్రి పూజ ఇలా చేస్తే - రాహు, కేతు దోషాలు & సంతానలేమి సమస్యలు మటుమాయం!

"డిసెంబర్​ 31 రాత్రి 12 గంటలకు ఈ పూజ చేస్తే - కొత్త ఏడాదిలో అదృష్టం మీదే"

ABOUT THE AUTHOR

...view details