తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశివారికి పెళ్లి కుదిరే ఛాన్స్- వృత్తి, వ్యాపారాల్లో ఫుల్ ప్రాఫిట్! - WEEKLY HOROSCOPE

డిసెంబర్​ 22వ తేదీ నుంచి డిసెంబర్​ 28వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 13 hours ago

Weekly Horoscope From December 22nd To December 28st 2024 : డిసెంబర్​ 22వ తేదీ నుంచి డిసెంబర్​ 28వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరమైన ప్రయత్నాలలో విజయాన్ని సాధించడంలో ప్రధానమైన అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయి. పట్టుదల అంకితభావంతో సవాళ్లను అధిగమిస్తారు. ఉద్యోగస్థులకు పని ప్రదేశంలో ఇబ్బందికర వాతావరణం ఉండవచ్చు. సహనంతో అన్ని సర్దుకుంటాయి. కీలక వ్యవహారాల్లో గందరగోళ స్థితిలో నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు చేటు తెస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కొత్త వ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేయడానికి అదనపు శ్రమ, కృషి అవసరం. ఒక ప్రణాళిక ప్రకారం సహోద్యోగుల సహకారంతో పనిచేస్తే అన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు వారం ప్రథమార్ధం అనుకూలించక పోయినా ద్వితీయార్ధంలో ఊహించని లాభాలు అందుకుంటారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు గడప ఎక్కేముందు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు లక్ష్యసాధన కోసం కష్టపడాల్సి ఉంటుంది. వృధా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్నీ రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉన్నప్పటికినీ సహోద్యోగుల సహకారంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చదువు నుంచి దృష్టి మరల్చవచ్చు. కమీషన్‌ వ్యాపారులకు, స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండక అశాంతితో ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌ విజయవంతమవుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విపరీతమైన లాభాలను పొందుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశాలలో వృత్తిని కొనసాగించాలని ప్రయత్నించే వారు శుభవార్తలు అందుకుంటారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిలో పురోగతి, ఆర్థికవృద్ధి ఉంటుంది. ఉద్యోగస్థులు మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. కోరుకున్న ప్రమోషన్, బదిలీ కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిపరంగా మరియు వాణిజ్యపరంగా ఎదగడానికి నూతన అవకాశాలు అందుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు శుభవార్తలు అందుకుంటారు. కల్యాణ యోగం ఉంది. ఆరోగ్య బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన శుభకరం.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉంటాయి. అన్ని రంగాల వారికి వారం ప్రథమార్ధంలో అదృష్ట యోగం, లక్ష్మీకటాక్షం ఉంటాయి. ఉద్యోగస్థులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారస్థులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. సంఘంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని సవాళ్లు ఎదురవుంటాయి. మీ ప్రతిభతో సవాళ్ళను అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

తుల (Libra) :తుల రాశి వారికి ఈ వరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఈ వారం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే పట్టుదలతో, ప్రియమైనవారి మద్దతుతో ఈ అడ్డంకులను అధిగమించవచ్చు. ఉద్యోగులకు పని ప్రదేశంలో సమస్యలు ఉండవచ్చు. మీ ఓర్పే మీకు శ్రీరామరక్ష. సహనంతో, కుటుంబ సభ్యుల సహాయంతో సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించండి. వారం మధ్యలో, పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. వ్యాపారంలో మంచి విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ కోసం మెరుగైన అవకాశాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం సంతృప్తినిస్తుంది. దైవ దర్శనం కోసం తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మేలు. గిట్టని వారు వృత్తి వ్యాపారాలలో అవాంతరాలు సృష్టించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు లేక నిరాశతో ఉంటారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. దైవ బలంతో శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు సంబంధిత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ప్రయాణాలు అనుకూలించవు. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. నవగ్రహ ప్రార్ధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగస్థులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్లండి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్ధాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శుభసమయం. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పని చేస్తే తప్ప విజయాలు సాధించలేరు. ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో సవాళ్లను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. మొండి వైఖరి వీడి సర్దుబాటు ధోరణితో ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి మద్దతు పూర్తిగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మరికొంత కాలం వేచి చూడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాస్తుతి పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ సమయం నడుస్తోంది. ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్థులకు సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఈ వారం అన్ని రంగాల వారు జీవితంలో ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగలకు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. సమాజంలో గొప్ప వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో గణనీయమైన ఆదాయానికి దారి తీస్తుంది. భూమి,ఇల్లు కొనుగోలు అమ్మకంలో మీ తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని ఆనందకరమైన వార్తలను అందుకుంటారు. మొత్తం మీద ఈ వారం పూర్తి శుభకరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సంపన్నులు అవుతారు. అన్ని రంగాల వారికి వారం ప్రారంభంలో నూతన అవకాశాలు మీ తలుపు తడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలలో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని కోరుకునేవారు కల నిజం అవుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు, బదిలీలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోతే వ్యాధుల బారిన పడవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు దృఢ పడతాయి. భూమి, భవనాలు, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. చట్టపరమైన కేసులలో ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈశ్వర ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details