తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశివారికి శత్రువుల నుంచి సమస్యలు! ఈశ్వరాధన శ్రేయస్కరం!! - Weekly Horoscope

Weekly Horoscope From June 23th to June 29nd 2024 : 2024 జూన్​ 23వ తేదీ నుంచి జూన్​ 29వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 4:51 AM IST

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From June 23th to June 29nd 2024 : 2024 జూన్​ 23వ తేదీ నుంచి జూన్​ 29వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేషరాశిలో జన్మించిన వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి, లక్ష్మీకటాక్షం ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. మీరు కలలు కనే విదేశీ ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. అదనంగా, కొత్త ఆదాయ మార్గాలు అందుకుంటారు. మొత్తం మీద ఈ వారం ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. శత్రువుల నుంచి, అసూయపరుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహసంచారం అనుకూలంగా లేనందున ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు, ఉద్యోగులు పనిలో తొందరపాటు లేకుండా నిదానంగా వ్యవహరించడం మేలు. ఇంద్రియ నిగ్రహం కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలకు ఆస్కారముంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలను సహనంతో పరిష్కరించుకుంటే సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ నిమిత్తం రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవత ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు వారం ప్రారంభంలో పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతనంగా పెట్టుబడులు పెట్టే ముందు శ్రేయోభిలాషుల సలహా తప్పనిసరి. వృత్తి వ్యక్తిగత జీవితాన్ని బాలన్స్ చేసుకుంటూ పని చేయడం వలన ఇంటా, బయట ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని అనారోగ్య సమస్యల కారణముగా వైద్యుని వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్య నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు వ్యాపారంలో సవాళ్లు, పోటీని ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. హనుమ దర్శనంతో శుభ ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు, ఉద్యోగులు తమ లక్ష్యంపై దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి. అహంకారం, అధికార గర్వం వీడి అందరినీ కలుపుకొని పోవడం మంచిది. సమష్టి కృషితో సాధించిన విజయాల ప్రయోజనం అందరికీ చెందేలా వ్యవహరిస్తే మేలు. వ్యాపారులకు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. లాభాలు కూడా ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ఇంకొంతకాలం వేచి చూస్తే మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. గణపతి ఆలయ సందర్శన విఘ్నాలను తొలగిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిలో సంతృప్తి కరమైన పురోగతి ఉంటుంది. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. స్నేహితుల సాయంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా పనిచేసి సంస్థని అభివృద్ధి చేస్తారు. మీ ప్రయత్నాన్ని సీనియర్లు మెచ్చుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వారం చివరలో విలాసాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవితభాగస్వామితో బంధాలు దృఢపడతాయి. విహార యాత్రలు, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి అస్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. సహోద్యోగులు, ఉన్నతాధికారుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు సమయానుకూలంగా నడుచుకుంటే వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన ఆపదలు తొలగిపోతాయి.

తుల (Libra) :తుల రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం, విజయం ఉంటాయి. ఉద్యోగులు చేపట్టిన ప్రతిపనిలోను విజయాన్ని సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు, ప్రమోషన్ పొందుతారు. నూతన బాధ్యతలను చేపడతారు. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు భవిష్యత్​లో ప్రయోజనకరంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలు కూడా అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబంతో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని నిమిత్తం సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బహుశా విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎన్నో రోజుల నుంచి పెండిగ్​లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి నిపుణులు, వ్యాపారులు సమష్టి కృషితోనే విజయాలు సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. అధికారంతో దేన్నైనా సాధించవచ్చు అనుకుంటే పొరపాటు. ఇది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, మీ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు కూడదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని వ్యవహారాలను చక్క బెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సమయం నష్టం, ధన నష్టం రెండూ ఉంటాయి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లకపోతే సమస్యలు తప్పవు. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారులు రుణాల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సమాజంలో పరపతి ఉన్న వ్యక్తుల సహాయం అవసరం అవుతుంది. రక్తసంబంధీకుల మధ్య తలెత్తిన భూ గృహ వివాదాలు కోర్టు వెలుపల పరిష్కారం ఉత్తమం. తీవ్ర అనారోగ్య సమస్యలతో చికాకు కలగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. కుటుంబంలో శాంతి కోసం తీవ్ర కృషి అవసరం. సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడం వలన సమస్యలు తగ్గుతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. బద్దకాన్ని వీడి సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తే గౌరవం ఉంటుంది. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో పెద్దల పట్ల బాధ్యతతో మెలగండి. శివపార్వతుల ఆలయ సందర్శనం శుభకరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం అధికంగా డబ్బు ఖర్చవుతుంది. వ్యాపారస్తులు పోటీదారుల నుంచి సవాళ్లు ఎదుర్కొంటారు. మీ బలహీనతలను ప్రత్యర్థి ఎదుటకు రానీయకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ధార్మిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నెగ్గాలంటే తగ్గాలి అనే సూత్రం ఈ వారం మీన రాశి వారికి వర్తిస్తుంది. సరైన సమయంలో సరైన కృషితో అఖండ విజయాలను సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సంస్థ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఇంటికి బంధువులు రావడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సంస్థ అభివృద్ధి కోసం, ఆర్థిక లాభాల కోసం పాటుపడతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details