ETV Bharat / state

మీకు ఈ కార్డు ఉందా? - లేకపోతే చాలా పథకాలు మిస్ అయినట్లే- ఎలా అప్లై చేయాలో తెలుసా? - Building Construction Worker card

భవన నిర్మాణ రంగాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే ఈ కార్డు తప్పనిసరి. అదెలా తీసుకోవాలి? ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Building Construction Worker card
Building Construction Worker card (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 3:54 PM IST

Building Construction Worker card: రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలవి. చేతినిండా పని దొరికితేనే కడుపు నిండే పరిస్థితి. ప్రతిరోజూ ఉదయం కూలీల అడ్డాల వద్ద పనుల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. పనులు దొరకని సమయంలో నిరాశగా ఇంటికి వెళ్లిపోయి పస్తులు ఉంటారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ఎలా తీసుకోవాలి? ఇందువల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరు అర్హులు?: ఈ కార్డు పొందాలనుకునే భవన నిర్మాణ కార్మికుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. కార్మికుడిగా నమోదు చేయించుకునే రోజు నాటికి 12 నెలల్లో తప్పనిసరిగా 90 రోజులకు తగ్గకుండా భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేసి ఉండాలి. తాపీమేస్త్రీ, హెల్పర్, సెంట్రింగ్ వర్కర్, పెయింటర్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, టైల్స్, వెల్డింగ్‌ ఇలా 54 రంగాల భవన నిర్మాణ కార్మికులు దీనిని పొందొచ్చు.

ఎలా నమోదు చేసుకోవాలి?: భవన నిర్మాణ రంగ కార్మికులుగా నమోదు చేసుకోవాలని అనుకున్న వారు.. ఫొటో, ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, పని వివరాలను సంబంధిత ఫారంలో నింపాలి. ఆ తర్వాత దానిని మీ సేవా ద్వారా రుసుము రూ.110 చెల్లించి సమర్పించాలి. ఆ తర్వాత దరఖాస్తు పత్రాలను జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో ఇవ్వాలి. అనంతరం మీ దరఖాస్తును అధికారులు పరిశీలించి కార్డు జారీ చేస్తారు. దీని గడువు సుమారు ఐదేళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత దీనిని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు ఇవి:

  • అమ్మాయి పెళ్లి కానుకగా రూ. 30వేలు ఇస్తారు.
  • ప్రసూతి సాయం కోసం రూ.30 వేలు అందిస్తారు.
  • ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు.
  • ప్రమాదంలో వైకల్యం ఏర్పడితే గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.
  • సాధారణ మరణం పొందిన ఆ కుటుంబానికి రూ. లక్ష ఇస్తారు.
  • ఎలా మరణించినా సరే.. దహన సంస్కారాల కోసం రూ.30 వేలు అందిస్తారు.
  • కార్మికుల్లో నైపుణ్యం పెంచడానికి న్యాక్‌ సెంటర్‌ ద్వారా శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన 15 రోజుల పాటు రోజుకు రూ.300 చెల్లించడమే కాకుండా భోజన సదుపాయం కల్పిస్తారు.
  • వైకల్యం పొందిన కార్మికులకు ఉచితంగా కృత్రిమ కాలు, వీల్​చైర్లు, ట్రైసైకిళ్లు లాంటివి అందిస్తారు
  • ప్రమాదవశాత్తు గాయపడి, అనారోగ్య పాలై పని చేయలేని స్థితిలో ఉన్న కార్మికులకు గరిష్ఠంగా నెలకు రూ.4,500 అందిస్తారు.
  • కార్మికులకు వైద్యుల కన్సల్టేషన్​తో పాటు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు సైతం నిర్వహిస్తారు.

ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల సాయం - ఈ స్కీమ్ గురించి తెలుసా? - Construction Workers Scheme

అమ్మాయి పెళ్లికి ప్రభుత్వ కానుక - కానీ వారికి మాత్రమే ఛాన్స్! - ఇలా అప్లై చేసుకోండి! - Marriage Gift Scheme in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.