ETV Bharat / offbeat

కొత్తిమీర త్వరగా వాడిపోతోందా ? - ఇలా స్టోర్​ చేస్తే వారం రోజులపైనే ఫ్రెష్​గా ఉంటుంది! - How to Keep Coriander Leaves Fresh - HOW TO KEEP CORIANDER LEAVES FRESH

కొత్తిమీర కొన్నప్పుడు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత రెండు రోజులకే వాడిపోతుంది. అలాకాకుండా కొత్తిమీర ఫ్రెష్​గా ఉండాలంటే ఇలా చేయండి.

How to Store Fresh Coriander
How to Store Fresh Coriander (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 3:33 PM IST

Updated : Oct 5, 2024, 3:40 PM IST

How to Store Coriander Fresh for Long Time : దాదాపు చేసే ప్రతి వంటలోనూ కొద్దిగా కొత్తిమీర వేస్తుంటారు. కర్రీ, చట్నీ, పులుసు, సాంబార్​, బిర్యానీ ఇలా ఏ రెసిపీలోకైనా కొత్తిమీర వేస్తేనే ఆ రుచి ఇంకాస్త బాగుంటుంది. అందుకే మార్కెట్​కి వెళ్లినప్పుడు వారానికి సరిపడా కొత్తిమీర తెచ్చుకుంటుంటారు. ఫ్రెష్​గా ఉంటదనుకుంటే.. రెండు రోజులకే కొత్తిమీర పూర్తిగా వాడిపోతుంది. ఇలా కాకుండా కొత్తిమీర వారం రోజుల పాటు ఫ్రెష్​గా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ టిప్స్​ ఏంటో మీరు చూసేయండి.

పేపర్​ టవల్​తో: మార్కెట్​ నుంచి కొత్తిమీర తీసుకొచ్చిన తర్వాత వేర్లు కట్​ చేయండి. ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడగండి. తర్వాత గాలికి ఆరబెట్టండి. ఇప్పుడు కొత్తిమీరను పేపర్​ టవల్​లో చుట్టండి. తర్వాత పేపర్​లో చుట్టిన కొత్తిమీరను డబ్బాలో పెట్టి మూత పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది.

నీటి జాడీలో.. ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడగండి. ఇప్పుడు నీటి జాడీలో కొత్తిమీర కాడలకు సరిపడా నీళ్లు పోయండి. తర్వాత కొత్తిమీరను జాడీలో పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆకులు ఫ్రెష్​గా ఉండడానికి రెండురోజులకు ఒకసారి వాటర్​ మార్చండి.

పసుపు నీళ్లు.. కొత్తిమీర శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. ఫ్యాన్​ గాలికి కొత్తిమీర ఆరబెట్టండి. ఇప్పుడు కొత్తమీరను పేపర్ టవల్​లో చుట్టి, డబ్బాలో పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటే కొత్తిమీర తాజాగా ఉంటుంది.

ఎయిర్​టైట్​ కంటెయినర్​లో.. ముందుగా కొత్తిమీర వేర్లను కట్​ చేసి, శుభ్రంగా కడగండి. తర్వాత ఫ్యాన్​ గాలికి ఆరబెట్టండి. ఇప్పుడు ఒక ఎయిర్​టైట్​ బాక్స్​లో కింద పేపర్​ టవల్​ పెట్టండి. ఇప్పుడు మధ్యలో కొత్తమీర ఉంచండి. పైన మళ్లీ పేపర్​ టవల్​ పెట్టి మూత పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటే.. కొత్తిమీర ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా వాడుకోవచ్చు.

మరికొన్ని టిప్స్​..

  • కొత్తిమీర, పుదీనా ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రిడ్జ్​లో ఉంచాలి.
  • ఎక్కువ మంది కొత్తిమీర తేగానే కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. అయితే నీరు, తేమంతా పోయాకే స్టోర్​ చేయాలి. ఫ్యాన్‌ కింద లేదా గాలికి ఆరబెట్టాలి.
  • కొత్తిమీరను వేర్లతో సహా స్టోర్ చేయకూడదు. ఎందుకంటే.. తేమ కాడలకు పాకి కొత్తిమీర త్వరగా కుళ్లిపోతుంది. కాబట్టి తప్పకుండా కాస్త మందంగా ఉండే కాడలను కోసేయాలి.
  • కొత్తిమీరను ఫ్రిడ్జ్‌లో మూత లేకుండా గాలి తగిలేలా పెడితే పాడైపోతుంది. అలాగే దాని స్మెల్​ మిగతా పదార్థాలకూ పాకుతుంది. కాబట్టి ఓ గిన్నెలో వేసి మూత పెట్టాలి.
  • ఈ టిప్స్​ పాటిస్తే ఎక్కువ రోజులు కొత్తిమీర ఫ్రెష్​గా ఉంటుంది.

కొత్తిమీరతో ప్రయోజనాలెన్నో.. తెలిస్తే తినకుండా అసలు వదలరు

కొత్తిమీర రైతుకు.. గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు

Last Updated : Oct 5, 2024, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.