Ways To Attract Goddess Lakshmi : సకల లోకాలకు ఐశ్వర్య ప్రదాత శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లిని శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనం కోరుకున్న సంపదలన్నీ పొందవచ్చు. సంపద అంటే కేవలం డబ్బే కాదు మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా సంపదే! మరి అలాంటి ఆనంద సంపదలు పొందాలంటే మన వంతుగా మనం ఏం చేయాలో చూద్దాం!
పరిశుభ్రతే ఐశ్వర్యం
మనం నివసించే ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత ఉన్నచోటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే ఇంట్లో అక్కర్లేని చెత్తాచెదారం ఎప్పటికప్పుడు బయట పడేస్తూ ఉండాలి.
ఈ వస్తువులు ఇంట్లో ఉంటే అరిష్టం
ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన గాజు పాత్రలు, చిరిగిపోయిన వస్త్రాలు, పాడైపోయిన వస్తువులను ఉంచుకోకూడదు. ఇవి ఇంటికి అరిష్టాన్ని తీసుకువస్తాయి.
కలహాల ఇంట కనిపించని లక్ష్మి
ఇంట్లో తరచుగా గొడవలు, కలహాలు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో సిరి నిలవదు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి కానీ, అనవసరంగా నిత్యం గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంటి నుంచి సిరి వెళ్లిపోతుంది.
తులసి లేని ఇంట కనబడని సిరి
హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటి పెరట్లో తులసి మొక్క ఉండి తీరాల్సిందే! తులసి లేని ఇంట్లో ఎన్ని పూజలు చేసిన శ్రీ మహాలక్ష్మీ నిలవదని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఇలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం
ఏ ఇంటి వాకిలి అయితే నిత్యం ముగ్గులతో కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఇంటి గడపను ప్రతి శుక్రవారం పసుపుకుంకుమలతో అలంకరించాలి. పెయింట్లతో ముగ్గులు వేసినా సరే, గడపకు పసుపు కుంకుమ అలంకరిస్తేనే శుభకరం. ఇంట్లో నివసించే వారు ఎప్పుడు కూడా ఒకరంటే ఒకరు అభిమానంతో ప్రియంగా మాట్లాడుకుంటూ ఉండాలి. కలహాలు ఉన్న ఇంట లక్ష్మీదేవి ఉండదని గుర్తుంచుకోవాలి.
నిత్య దీపారాధన శ్రేయస్కరం
మన ఇంట్లో పూజా మందిరంలో మనం నిత్యం వెలిగించే దీపమే మన కుటుంబానికి ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును ఇస్తుంది. కాబట్టి ప్రతి నిత్యం దేవుని ఎదుట దీపం వెలిగించాలి.
లక్ష్మీదేవి స్థానాలు ఇవే!
శ్రీ మహాలక్ష్మీదేవి కలియుగంలో ఈ స్థానాల్లో కొలువై ఉంటుందని శాస్త్ర వచనం. అవేంటంటే -
- పసుపు కుంకుమలు
- మారేడు దళాలు
- తామరతూడు
- తామర పువ్వులు
- బంగారం
- వెండి
- ముత్తైదువు పాపిట సింధూరం
- స్త్రీల మంగళ సూత్రాలు
- నల్లపూసలు
- పసి పిల్లల నవ్వులు
- గోమోపురం
- శంఖం
- గోమతి చక్రాలు
- పచ్చకర్పూరం
- గోక్షీరం
- పెరుగు
- ఉప్పు
- ధాన్యం
ఇవన్నీ కూడా శ్రీమహాలక్ష్మి కొలువై ఉన్న స్థానాలు. అందుకే ఈ వస్తువులను మనం ఎప్పుడు నేల మీద కానీ, నిద్రించే మంచాలపైన కానీ ఉంచరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే!
కష్టేఫలి!
చివరగా మనం ఎన్ని పూజలు చేసిన సోమరితనం, బద్ధకం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అసలు పొందలేం. కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అనే నానుడి ఉంది కదా! అందుకే అంటారు కదా! శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం. అందుకే ఆ శ్రీదేవి అనుగ్రహాన్ని కోరుకునేవారు కష్టపడి పనిచేసి తమ తమ వృత్తి వ్యాపారాలు అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి. కష్టపడి పని చేస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. కష్టాన్ని నమ్ముకొని నీతి నిజాయితీతో పనిచేసే వారికి అండగా ఆ శ్రీమహాలక్ష్మీ ఎప్పుడు ఉంటుంది ఆ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో కళకళలాడుతూ ఉంటుంది.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
పూజ గదిలో దేవుడి ఫొటోలు లిమిట్లో ఉండాల్సిందే! ఈవెనింగ్ దీపం కంపల్సరీ! - Pooja Room Vastu Rules
వాస్తు ప్రకారం ఇంట్లో బీరువా ఈ దిక్కులో ఉంటే లక్ష్మీ కటాక్షం! అప్పుల బాధలు ఉండవు! - Vastu Tips For Beeruva Placement