Vastu Tips to Increase Wealth: ఈ ప్రపంచంలో మనిషి జీవితానికి తప్పనిసరిగా కావాల్సింది డబ్బు. ఈ కాలంలో డబ్బు లేకుంటే ఏ పని జరగదు. అందుకే "ధనం మూలం ఇదం జగత్" అన్నారు. అయితే చాలా మంది వివిధ రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. డబ్బును ఎలా సంపాదించాలో తెలియక కొందరు బాధపడుతుంటే, ఎలా నిలుపుకోవాలో తెలియని వారు మరికొందరు. అయితే వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను పాటించటం ద్వారా మనకు మంచి ధన లాభం (Vastu Shastra for Increase Wealth) కలుగుతుందని ప్రముఖ వాస్తు శాస్త్ర పండితులు మాచిరాజు వేణుగోపాల్ తెలిపారు. డబ్బులు సంపాదించే మార్గాలతో పాటు కుటుంబ కలహాల నివారణ కోసం వాస్తు శాస్త్రంలో తెలిపిన సూచనలు ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
ధన లాభం కోసం వాస్తు శాస్త్రంలో పాటించాల్సిన నియమాలు
- రావి ఆకుపైన శ్రీరామ అని రాసి దానిపై ఏదైనా తీపి పదార్థం ఉంచి మీ దగ్గర్లోనే హనుమాన్ ఆలయంలో సమర్పించండి. ఇలా చేస్తే తప్పక ధన లాభం కలుగుతుంది.
- ప్రతిరోజు ఉదయం లక్ష్మీదేవికి ఎర్ర పూలు సమర్పించి, ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేయండి.
- 11 గవ్వలు తీసుకుని వాటికి కుంకుమ పువ్వు రాసి పసుపు రంగు వస్త్రంలో పెట్టి, మనం తరచుగా డబ్బు దాచుకునే ప్రదేశంలో దీనిని ఉంచాలి. ఇలా చేస్తే ధన లాభం జరిగే ఆస్కారం అధికంగా ఉంటుంది.
- బాత్ రూంలో నైరుతి మూల ఓ గాజు గిన్నెలో ఉప్పు పెట్టి ప్రతి నెల మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యులంతా సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో సఖ్యత లేకపోతే ధన సంపాదన పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.