తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? - ఈ వాస్తు లోపం ఉన్నట్టే! - Vastu Tips for Money in telugu

Vastu Tips To Attract Money : డబ్బు బాగా సంపాదించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ.. కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతిలో నిలవదు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా? అయితే.. వాస్తు లోపమే కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు!

Vastu Tips To Attract Money
Vastu Tips To Attract Money

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 11:47 AM IST

Vastu Tips To Attract Money : డబ్బు సంపాదించాలని లేనిది ఎవరికి? పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఎన్నిసార్లు డబ్బును తలుచుకుంటారో తెలియదు. దాన్ని సంపాదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరెన్నో పనులు చేస్తుంటారు. కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చేతిలో మాత్రం డబ్బు నిలవదు చాలా మందికి! నెలవారీ జీతం వచ్చేవాళ్లూ.. వ్యాపారం చేసేవాళ్లు కూడా కష్టాలు, నష్టాలతో అవస్థలు పడుతుంటారు. ఏదో ఒకరకంగా దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి. ఈ పరిస్థితి రావడానికి వాస్తు లోపమే కారణం కావొచ్చని అంటున్నారు నిపుణులు. అవి సరిచేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో కొలువు ఉంటుందని అంటున్నారు. మరి.. ఆ వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇలా చేయండి..

  • మీ చేతుల్లో ఎప్పుడూ డబ్బు నిలవాలంటే.. మీ ఇల్లు నిత్యం పరిశుభ్రంగా ఉండాలి. మీరు పనిచేసే ప్రదేశం కూడా క్లీన్​గా ఉండాలి.
  • మరీ ముఖ్యంగా.. ఇంట్లో ఉత్తర దిక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కులో కుబేరుడు ఉంటాడట. కుబేరుడు సిరిసంపదలను కలగజేస్తాడని నమ్ముతారు.
  • మరో ముఖ్యమైన విషయం.. ఉత్తర దిక్కున వంటగది ఉండకూడదు. ఈ దిక్కులో కిచెన్‌ ఉండటం వల్ల డబ్బులు వృద్ధి చెందవట.
  • అలాగే.. సింక్‌ పక్కన గ్యాస్‌ స్టౌవ్‌ను పెట్టకూడదని సూచిస్తున్నారు. మధ్యలో కొద్దిగా స్పేస్‌ ఉండేలా చూసుకోవాలట.
  • మీ ఇంట్లో వాటర్‌ ఫౌంటేయిన్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటే ఉత్తర దిశలో ఉండేలా చూసుకోండి.
  • మీ ఇంట్లో ఏదైనా గోడలకు పగుళ్లు వస్తే వాటిని రిపేర్ చేయించండి. అలాగే పైపుల నుంచి నీళ్లు లీక్‌ అయితే సరిచేయించండి.
  • మీ విలువైన నగలు, డబ్బులను ఇంట్లో ఆగ్నేయ దిశలో భద్రపరచడం మానుకోవాలట.
  • ఎందుకంటే.. ఈ దిశలో అగ్నిదేవుడు ఉంటాడని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల డబ్బు ఖర్చు అయిపోతుందట.
  • ఈ దిశలో ఉండే గోడలకు లైట్‌ డార్క్‌ రంగులో ఉండే కలర్‌లను వేయించండి. అలాగే గోడలకు పెయింటింగ్‌లు, కర్టెన్లు ఏర్పాటు చేయండి.
  • నగలు, డబ్బులను దాచే లాకర్లు, బీరువాలను ఎల్లప్పుడూ ఇంట్లో నైరుతి దిశలో ఉండేలా చూసుకోండి. దీనివల్ల సంపద నిలుస్తుందట.
  • ఇంటి తలుపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
  • అలాగే.. ఇంట్లో మనీ ప్లాంట్‌ మొక్కలను పెంచండి. వీటిని పెంచడం వల్ల సిరిసంపదలు వచ్చి మీ ఇంట్లో చేరతాయి.
  • మనీ ప్లాంట్‌ ఇంటికి పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ను కలుగజేస్తుంది. ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటున్నారు.
  • పైన సూచించిన విషయాలన్నీ పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details