Vastu Tips for Holi 2024 : వసంత రుతువుకు స్వాగతం చెబుతూ ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పండగ హోలీ. ఈ కలర్‌ఫుల్ ఫెస్టివల్‌ను తెలుగు సంవత్సరాది ప్రకారం.. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం చివరి పౌర్ణమి రోజు జరుపుకుంటాం. జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి, బతుకు రంగుల మయం కావాలని జనం కోరుకుంటారు. అయితే, ఈ ఏడాది హోలీ(Holi 2024) చాలా ప్రత్యేకమని చెబుతున్నారు వాస్తు పండితులు.
ఎందుకంటే.. అదే రోజు చంద్ర గ్రహణం, మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయట. కాబట్టి, ఈ హోలీ నాడు కొన్ని వాస్తు నియమాలను పాటించడం ద్వారా జీవితంలో సానుకూల ఫలితాలు పొందడంతోపాటు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హోలీ నాడు చేయాల్సిన పనులు :
- ఈ హోలీ మీ జీవితంలో అష్టైశ్వర్యాలు నింపాలంటే వాస్తు ప్రకారం మీరు చేయాల్సిన మొదటి పని.. ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని విష్ణువును ఆరాధించాలి.
- అలాగే ఇంట్లో చెత్త, చెదారం లేకుండా ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- ఈ రంగుల పండగ రోజున పొరపాటున కూడా ఎవరినీ అవమానించకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
- ఇంటి ఆవరణలోనే హోలీని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాదు పగటి పూటనే హోలీని జరుపుకోవాలట. చీకటి పడిన తర్వాత హోలీ ఆడితే దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంటుందట.
- హోలీ నాడు ఇంట్లో వండిన ఆహారాన్ని ముందుగా దేవుడికి సమర్పించి ఆ తర్వాత తింటే మంచి ఫలితాలు చేకూరుతాయంటున్నారు.
- హోలీకి ముందు నాడు కాముని దహనం చేసిన బూడిదను ఇంటికి తెచ్చుకొని ఇంట్లోని నాలుగు మూలల్లోనూ వేస్తే వాస్తు దోషాల నివారణ జరుగుతుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.